హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UPSC Recruitment 2021: కేంద్ర హోమ్ శాఖలో ఉద్యోగాలు... రూ.1,50,000 వరకు జీతం

UPSC Recruitment 2021: కేంద్ర హోమ్ శాఖలో ఉద్యోగాలు... రూ.1,50,000 వరకు జీతం

UPSC Recruitment 2021: కేంద్ర హోమ్ శాఖలో ఉద్యోగాలు... రూ.1,50,000 వరకు జీతం
(ప్రతీకాత్మక చిత్రం)

UPSC Recruitment 2021: కేంద్ర హోమ్ శాఖలో ఉద్యోగాలు... రూ.1,50,000 వరకు జీతం (ప్రతీకాత్మక చిత్రం)

UPSC Recruitment 2021 | కేంద్ర హోమ్ శాఖలో ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర హోమ్ శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజెస్ రీజనల్ ఇంప్లిమెంటేషన్ ఆఫీసెస్‌లో రీసెర్చ్ ఆఫీసర్ (ఇంప్లిమెంటేషన్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 8 ఖాళీలు ఉన్నాయి. దేశంలోని ఎనిమిది రీజనల్ ఇంప్లిమెంటేషన్ ఆఫీసుల్లో ఈ పోస్టులున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://upsconline.nic.in/ లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి ముందు నోటిఫికేషన్ చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 12 చివరి తేదీ.

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.25,000 వరకు పెరగనున్న వేతనం

Constable Jobs: టెన్త్ పాసయ్యారా? 25,271 కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేయండి ఇలా

UPSC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


భర్తీ చేసే పోస్టులు- రీసెర్చ్ ఆఫీసర్ (ఇంప్లిమెంటేషన్)

మొత్తం ఖాళీలు- 8

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 12

విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హిందీ లేదా ఇంగ్లీష్‌లో మాస్టర్స్ డిగ్రీ పాస్ కావాలి. డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్, హిందీ లేదా ఇతర మీడియంలో చదివి ఉండాలి.

వయస్సు- 30 ఏళ్లు

దరఖాస్తు ఫీజు- రూ.25

రీజనల్ ఇంప్లిమెంటేషన్ ఆఫీసులు ఉన్న ప్రాంతాలు- ఢిల్లీ, ఘజియాబాద్, భోపాల్, ముంబై, కోల్‌కతా, గువాహతి, బెంగళూరు, కొచ్చిన్

SBI Recruitment 2021: ఎస్‌బీఐలో 6100 జాబ్స్... దరఖాస్తుకు 4 రోజులే గడువు

Army Jobs 2021: డిగ్రీ పాస్ అయినవారికి ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాలు... రూ.1,77,500 వరకు జీతం

UPSC Recruitment 2021: అప్లై చేయండి ఇలా


అభ్యర్థులు ముందుగా https://upsconline.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

హోమ్ పేజీలో ONLINE RECRUITMENT APPLICATION (ORA) FOR VARIOUS RECRUITMENT POSTS లింక్ పైన క్లిక్ చేయాలి.

కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Research Officer (Implementation) లింక్ ఉంటుంది.

అందులో Apply Now పైన క్లిక్ చేయాలి.

ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా చదివి తర్వాతి పేజీలోకి వెళ్లాలి.

New Registration పైన క్లిక్ చేయాలి.

పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

చివరగా ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.

First published:

Tags: CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Union Home Ministry, Upcoming jobs

ఉత్తమ కథలు