హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UPSC Recruitment 2021: రూ.2,18,000 వరకు వేతనంతో ఉద్యోగాలు... బీటెక్, బీఎస్సీ పాస్ అయినవారు అప్లై చేయండి ఇలా

UPSC Recruitment 2021: రూ.2,18,000 వరకు వేతనంతో ఉద్యోగాలు... బీటెక్, బీఎస్సీ పాస్ అయినవారు అప్లై చేయండి ఇలా

UPSC Recruitment 2021: రూ.2,18,000 వరకు వేతనంతో ఉద్యోగాలు... బీటెక్, బీఎస్సీ పాస్ అయినవారు అప్లై చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

UPSC Recruitment 2021: రూ.2,18,000 వరకు వేతనంతో ఉద్యోగాలు... బీటెక్, బీఎస్సీ పాస్ అయినవారు అప్లై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

UPSC Recruitment 2021 | బీటెక్, బీఈ, బీఎస్‌సీ, ఎంటెక్ లాంటి కోర్సులు పాస్ అయినవారికి గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పలు పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

  కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వరుసగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తోంది. అందులో భాగంగా మరో నోటిఫికేషన్ ద్వారా 36 పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్, సీనియర్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది యూపీఎస్‌సీ. బీటెక్, బీఎస్సీ, ఎంటెక్, పీహెచ్‌డీ లాంటి కోర్సులు పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు 2021 డిసెంబర్ 2 లోగా దరఖాస్తు చేయాలి. విద్యార్హతలు, ఇతర వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

  LIC Recruitment 2021: ఎల్ఐసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... డిగ్రీ పాస్ అయితే చాలు

  UPSC Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


  మొత్తం ఖాళీలు36
  ప్రొఫెసర్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్)1
  అసోసియేట్ ప్రొఫెసర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్)3
  అసోసియేట్ ప్రొఫెసర్ (కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్)3
  అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్)7
  అసిస్టెంట్ ప్రొఫెసర్ (కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్)5
  జాయింట్ అసిస్టెంట్ డైరెక్టర్3
  డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్6
  సీనియర్ అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ మైన్స్8


  ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

  Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగానికి అప్లై చేశారా? అయితే వెంటనే ఇలా చేయండి

  UPSC Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా...


  Step 1- అభ్యర్థులు ముందుగా యూపీఎస్‌సీ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ https://upsconline.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

  Step 2- హోమ్ పేజీలో ONLINE RECRUITMENT APPLICATION (ORA) FOR VARIOUS RECRUITMENT POSTS పైన క్లిక్ చేస్తే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ కనిపిస్తుంది.

  Step 3- ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, జాయింట్ అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ లింక్స్ వేర్వేరుగా ఉంటాయి.

  Step 4- అభ్యర్థి ఏ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పోస్టుకు సంబంధించిన Apply Now లింక్ పైన క్లిక్ చేయాలి.

  Step 5- ఆ తర్వాత నియమనిబంధనలన్నీ ఓసారి చదువుకోవాలి.

  Step 6- New Registration పైన క్లిక్ చేసి అభ్యర్థి తన వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

  Step 7- దరఖాస్తు ఫామ్ పూర్తి చేసిన తర్వాత ఫీజు చెల్లించాలి.

  Step 8- జనరల్ అభ్యర్థులు రూ.25 ఫీజు చెల్లించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.

  Step 9- దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Central Government Jobs, Govt Jobs 2021, Job notification, JOBS, UPSC

  ఉత్తమ కథలు