UPSC Recruitment 2021: జర్నలిజంలో అనుభవం ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... రూ.1,42,000 వేతనం

UPSC Recruitment 2021: జర్నలిజంలో అనుభవం ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... రూ.1,42,000 వేతనం (ప్రతీకాత్మక చిత్రం)

UPSC Recruitment 2021 | జర్నలిజంలో అనుభవం ఉన్నవారికి శుభవార్త. యూపీఎస్‌సీ పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖలో పలు ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు పలు భాషల్లో జర్నలిజంలో అనుభవం ఉన్నవారిని నియమించుకోబోతోంది. సీనియర్ గ్రేడ్ ఆఫ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 34 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 12 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in/ లో తెలుసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి. అప్లై చేసేముందు నోటిఫికేషన్‌ చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

    UPSC Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 34
    తెలుగు- 5
    హిందీ- 9
    ఇంగ్లీష్- 3
    పంజాబీ- 3
    ఒడియా- 3
    బెంగాలీ- 1
    మరాఠీ- 5
    గుజరాతీ- 1
    అస్సామీ- 2
    మణిపూరి- 2

    IT Jobs 2021: ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్స్‌కి 1,20,000 ఉద్యోగాలు

    TCS National Qualifier Test: ఈ ఎగ్జామ్ రాయండి... కార్పొరేట్ కంపెనీలో జాబ్‌కి ట్రై చేయండి

    UPSC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    భర్తీ చేసే పోస్టులు- సీనియర్ గ్రేడ్ ఆఫ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 12
    విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, డిగ్రీ పాస్ కావాలి. పదో తరగతి సంబంధిత భాషలో చదివి ఉండాలి.
    అనుభవం- ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తిగల సంస్థలు, లిస్టెడ్ ప్రైవేట్ సంస్థలకు చెందిన న్యూస్ ఏజెన్సీ, న్యూస్‌పేపర్‌లో జర్నలిజం, పబ్లిసిటీ, పబ్లిక్ రిలేషన్ విభాగాల్లో రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
    వయస్సు- 30 ఏళ్ల లోపు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
    వేతనం- ఏడో పే కమిషన్‌లో లెవెల్ 7 పే స్కేల్ వర్తిస్తుంది. అంటే రూ.44,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.1,42,400 వేతనం లభిస్తుంది.

    SBI Jobs 2021: ఎస్‌బీఐలో 6100 ఉద్యోగాలు... ఎంపిక చేసేది ఇలాగే

    Principal Jobs: మొత్తం 363 ప్రిన్సిపాల్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

    UPSC Recruitment 2021: అప్లై చేయండి ఇలా


    అభ్యర్థులు ముందుగా https://upsconline.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    హోమ్ పేజీలో ONLINE RECRUITMENT APPLICATION (ORA) FOR VARIOUS RECRUITMENT POSTS లింక్ పైన క్లిక్ చేయాలి.
    Advertisement No. : 09/2021 పైన క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది.
    నోటిఫికేషన్ పూర్తిగా చదివి అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు Senior Grade of Indian Information Service లింక్ పక్కన Apply Now పైన క్లిక్ చేయాలి.
    ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా చదివి తర్వాతి పేజీలోకి వెళ్లాలి.
    New Registration పైన క్లిక్ చేయాలి.
    పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
    చివరగా ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
    అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: