Home /News /jobs /

UPSC RECRUITMENT 2021 UNION PUBLIC SERVICE COMMISSION INVITES APPLICATIONS FOR 21 PROFESSOR ASSOCIATE PROFESSOR AND TUTOR POSTS SS

UPSC Recruitment 2021: యూపీఎస్‌సీ మరో జాబ్ నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

UPSC Recruitment 2021: యూపీఎస్‌సీ మరో జాబ్ నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

UPSC Recruitment 2021: యూపీఎస్‌సీ మరో జాబ్ నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

UPSC Recruitment 2021 | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మరో జాబ్ నోటిఫికేషన్ ద్వారా 21 పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

    నిరుద్యోగులకు అలర్ట్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. లేటెస్ట్ నోటిఫికేషన్ ద్వారా 21 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇప్పటికే మరో నోటిఫికేషన్ ద్వారా 36 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్, సీనియర్ అసిస్టెంట్ లాంటి పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 16 చివరి తేదీ. సంబంధిత సబ్జెక్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ పాస్ అయినవారు అప్లై చేయొచ్చు.

    TCS Jobs: ఆ కోర్సు పాస్ అయ్యారా? టీసీఎస్‌లో ఉద్యోగాలున్నాయి... రేపటిలోగా దరఖాస్తు చేయండి

    UPSC Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...





















































    మొత్తం ఖాళీలు21 విద్యార్హతలువయస్సు
    ప్రొఫెసర్ (కంట్రోల్ సిస్టమ్)1 కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కంట్రోల్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ. 50 ఏళ్లు
    అసోసియేట్ ప్రొఫెసర్ (కంప్యూటర్ సైన్స్)1 కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ. 40 ఏళ్లు
    అసోసియేట్ ప్రొఫెసర్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్)1 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ. 40 ఏళ్లు
    అసోసియేట్ ప్రొఫెసర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్)1 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ. 43 ఏళ్లు
    అసోసియేట్ ప్రొఫెసర్ (మెకానికల్ ఇంజనీరింగ్)2 మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ. 40 ఏళ్లు
    అసోసియేట్ ప్రొఫెసర్ (మెటల్లార్జీ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్)1 మెటల్లార్జీ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ. 40 ఏళ్లు
    ట్యూటర్14 బీఎస్‌సీ నర్సింగ్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ నర్సింగ్. 35 ఏళ్లు

    Southern Railway Jobs: నిరుద్యోగులకు అలర్ట్... రైల్వేలో ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

    UPSC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 16

    దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2021 డిసెంబర్ 17

    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

    దరఖాస్తు ఫీజు- రూ.25. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.

    ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    UPSC Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా...


    Step 1- అభ్యర్థులు ముందుగా యూపీఎస్‌సీ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ https://upsconline.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    Step 2- హోమ్ పేజీలో ONLINE RECRUITMENT APPLICATION (ORA) FOR VARIOUS RECRUITMENT POSTS పైన క్లిక్ చేస్తే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ కనిపిస్తుంది.

    Step 3- ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ లింక్స్ వేర్వేరుగా ఉంటాయి.

    Step 4- అభ్యర్థి ఏ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పోస్టుకు సంబంధించిన Apply Now లింక్ పైన క్లిక్ చేయాలి.

    Step 5- ఆ తర్వాత నియమనిబంధనలన్నీ ఓసారి చదువుకోవాలి.

    Step 6- New Registration పైన క్లిక్ చేసి అభ్యర్థి తన వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

    Step 7- దరఖాస్తు ఫామ్ పూర్తి చేసిన తర్వాత ఫీజు చెల్లించాలి.

    Step 8- జనరల్ అభ్యర్థులు రూ.25 ఫీజు చెల్లించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.

    Step 9- దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Central Government Jobs, Govt Jobs 2021, Job notification, JOBS, UPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు