UPSC Jobs: మొత్తం 121 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... యూపీఎస్‌సీ నోటిఫికేషన్

UPSC Recruitment 2020 | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC 121 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

news18-telugu
Updated: July 27, 2020, 2:51 PM IST
UPSC Jobs: మొత్తం 121 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... యూపీఎస్‌సీ నోటిఫికేషన్
UPSC Jobs: మొత్తం 121 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... యూపీఎస్‌సీ నోటిఫికేషన్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 121 ఖాళీలను ప్రకటించింది. మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్, స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 13 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://upsc.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు https://www.upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లై చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. ఇక ఇప్పటికే మరో 94 పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.

UPSC Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు- 121
మెడికల్ ఆఫీసర్- 36
అసిస్టెంట్ ఇంజనీర్- 3
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్- 60
సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్- 21ఆర్కిటెక్ట్ గ్రూప్ ఏ- 1

UPSC Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 24
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 13
విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
దరఖాస్తు ఫీజు- రూ.25. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
Published by: Santhosh Kumar S
First published: July 27, 2020, 2:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading