UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్

UPSC Recruitment 2020 | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. యూపీఎస్‌సీ 94 పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.

news18-telugu
Updated: July 14, 2020, 5:31 PM IST
UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్
UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC పలు నోటిఫికేషన్ల ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఉద్యోగాల భర్తీకి అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో యూపీఎస్‌సీ రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది. రెండు నోటిఫికేషన్ల ద్వారా 94 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. చీఫ్ డిజైన్ ఇంజనీర్, డిప్యూటీ సూపరింటెండెంట్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ వెటర్నరీ ఆఫీసర్, డిప్యూటీ డైరెక్టర్ లాంటి పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో చూడొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి జూలై 30 చివరి తేదీ. ఈ రెండు నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://upsc.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు.

UPSC Recruitment 2020: ఖాళీల వివరాలివే...



మొత్తం ఖాళీలు- 94
చీఫ్ డిజైన్ ఆఫీసర్- 1
డిప్యూటీ సూపరింటెండెంట్- 2
అసిస్టెంట్ ఇంజనీర్- 63
అసిస్టెంట్ వెటర్నరీ ఆఫీసర్- 1అసిస్టెంట్ డైరెక్టర్- 13
అసిస్టెంట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్- 2
డిప్యూటీ డైరెక్టర్- 3
జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్- 2
రీజనల్ హోమ్ ఎకనమిస్ట్- 1
అసిస్టెంట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్- 3
సైంటిస్ట్ బీ (కంప్యూటర్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)- 1
సైంటిస్ట్ సీ (సీనియర్ హైడ్రాలజిస్ట్)- 3
రీసెర్చ్ ఆఫీసర్- 1
అసిస్టెంట్ సెక్రెటరీ- 1
Published by: Santhosh Kumar S
First published: July 14, 2020, 5:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading