కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఉద్యోగాల నియామక ప్రక్రియలో జాప్యం తప్పట్లేదు. అనేక సంస్థలో దరఖాస్తు గడువును పొడిగిస్తున్నాయి లేదా నోటిఫికేషన్లను వాయిదా వేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 85 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరించింది. వాస్తవానికి ఏప్రిల్ 2న దరఖాస్తు గడువు ముగిసింది. కానీ మార్చి నుంచి లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో అప్లై చేయాలనుకున్నవారు దరఖాస్తు చేయలేకపోయారు. వారికి మరో అవకాశం ఇవ్వాలని యూపీఎస్‌సీ భావించింది. అందుకే దరఖాస్తు చేయడానికి మరో ఛాన్స్ ఇస్తున్నట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేసిన తర్వాత 20 రోజుల వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చని యూపీఎస్‌సీ ప్రకటించింది. అంటే కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తేసినా ఆ తర్వాత 20 రోజుల వరకు అభ్యర్థులకు ఛాన్స్ ఉంటుంది. అంటే లాక్‌డౌన్ ఎత్తేయగానే దరఖాస్తు లింక్ యాక్టివేట్ చేయనుంది యూపీఎస్‌సీ. ఈ నోటిఫికేషన్ ద్వారా చీఫ్ డిజైన్ ఇంజనీర్, డిప్యూటీ సూపరింటెండెంట్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ వెటర్నరీ ఆఫీసర్, డిప్యూటీ డైరెక్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది యూపీఎస్‌సీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://upsc.gov.in/ ఓపెన్ చేసి చూడొచ్చు. https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు- 85
చీఫ్ డిజైన్ ఆఫీసర్- 1
డిప్యూటీ సూపరింటెండెంట్- 2
అసిస్టెంట్ ఇంజనీర్- 63
అసిస్టెంట్ వెటర్నరీ ఆఫీసర్- 1
అసిస్టెంట్ డైరెక్టర్- 13
అసిస్టెంట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్- 2
డిప్యూటీ డైరెక్టర్- 3
దరఖాస్తుకు చివరి తేదీ- లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత 20 రోజుల వరకు
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
Jobs: హైదరాబాద్ వాటర్ బోర్డులో ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంచిన టీఎస్‌పీఎస్‌సీ
Jobs: తెలంగాణలోని ఎయిమ్స్‌లో 141 జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే
DRDO Jobs: డీఆర్‌డీఓలో 185 ఉద్యోగాలు... రేపటి నుంచి దరఖాస్తులు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Corona, Corona virus, Coronavirus, Covid-19, Exams, Job notification, JOBS, Lockdown, NOTIFICATION, UPSC