హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

EPFO Jobs: డిగ్రీ పాసైనవారికి ఈపీఎఫ్ఓలో 421 ఉద్యోగాలు... యూపీఎస్‌సీ నోటిఫికేషన్

EPFO Jobs: డిగ్రీ పాసైనవారికి ఈపీఎఫ్ఓలో 421 ఉద్యోగాలు... యూపీఎస్‌సీ నోటిఫికేషన్

EPFO Jobs: డిగ్రీ పాసైనవారికి ఈపీఎఫ్ఓలో 421 ఉద్యోగాలు... యూపీఎస్‌సీ నోటిఫికేషన్
(ప్రతీకాత్మక చిత్రం)

EPFO Jobs: డిగ్రీ పాసైనవారికి ఈపీఎఫ్ఓలో 421 ఉద్యోగాలు... యూపీఎస్‌సీ నోటిఫికేషన్ (ప్రతీకాత్మక చిత్రం)

UPSC Recruitment 2020 | ఆసక్తిగల అభ్యర్థులు యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

  ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO సంస్థలో భారీగా ఖాళీల భర్తీ జరుగుతోంది. ఈపీఎఫ్ఓలో ఖాళీలను భర్తీ చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC నోటిఫికేషన్ జారీ చేసింది. ఈపీఎఫ్‌ఓలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ / అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది యూపీఎస్‌సీ. మొత్తం 421 ఖాళీలున్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది యూపీఎస్‌సీ. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

  UPSC Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


  మొత్తం ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ / అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు- 421

  దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 31 సాయంత్రం 6 గంటలు

  దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 1

  రిక్రూట్‌మెంట్ టెస్ట్- 2020 అక్టోబర్ 4

  విద్యార్హత- న్యాయ శాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ / న్యాయ శాస్త్రంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ / ఎంబీఏ / పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ / కంపెనీ సెక్రటరీ / చార్టర్డ్ అకౌంటెంట్ / కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ లాంటి అర్హతలుండాలి. అడ్మినిస్ట్రేషన్ / అకౌంట్స్ / న్యాయ సంబంధిత వ్యవహారాల్లో ప్రభుత్వ లేదా లిస్టెడ్ ప్రైవేట్ సంస్థల్లో రెండేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

  వయస్సు- 30 ఏళ్ల లోపు

  ఎంపిక ప్రక్రియ- రాత పరీక్ష, ఇంటర్వ్యూ.

  నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

  Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  కుర్రాళ్ల కోసం సరికొత్త బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ వచ్చేస్తోంది... ఎలా ఉందో చూడండి

  ఇవి కూడా చదవండి:

  Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు 8 నోటిఫికేషన్లు... 8,612 పోస్టులు

  Jobs: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో జాబ్స్... తెలంగాణలో 438, మొత్తం 6060 పోస్టులు

  Telangana Jobs: ఇంటర్ పాసైనవారికి ఐఏఎఫ్‌లో జాబ్స్... సంగారెడ్డిలో రిక్రూట్‌మెంట్ ర్యాలీ

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, EPFO, Exams, Job notification, JOBS, NOTIFICATION, UPSC

  ఉత్తమ కథలు