UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్

UPSC Recruitment 2020 | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. యూపీఎస్‌సీ పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది.నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: August 25, 2020, 2:48 PM IST
UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్
UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. హోమ్, కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖతో పాటు పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 35 పోస్టుల్ని ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.upsc.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 10 చివరి తేదీ.

Army Jobs: బీటెక్ అర్హతతో ఆర్మీలో జాబ్స్... దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

Govt Scheme: జాబ్ పోయిందా? అయినా సగం జీతం తీసుకోవచ్చు... అప్లై చేయండిలా

UPSC Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 35
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (న్యూరాలజీ), కుటుంబ, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ- 24
రీసెర్చ్ ఆఫీసర్ (సోషల్ స్టడీస్), కేంద్ర హోం శాఖ- 1సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (లై-డిటెక్షన్), ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ- 3
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (హోమియోపతి), డైరెక్టరేట్ ఆఫ్ ఆయుష్- 7

SSC Constable Jobs: ఇంటర్ పాసయ్యారా? 5846 కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేయండి

ECIL Jobs: బీటెక్ పాసైనవారికి 350 ఉద్యోగాలు... ఈసీఐఎల్-హైదరాబాద్ జాబ్ నోటిఫికేషన్

UPSC Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 21
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 10
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.25. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
ఎంపిక విధానం- పర్సనల్ ఇంటర్వ్యూ లేదా రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ.
Published by: Santhosh Kumar S
First published: August 25, 2020, 2:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading