UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ మరో నోటిఫికేషన్

UPSC Recruitment 2019 | ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను upsconline.nic.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు నవంబర్ 28 చివరి తేదీ.

news18-telugu
Updated: November 19, 2019, 6:25 PM IST
UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ మరో నోటిఫికేషన్
UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ మరో నోటిఫికేషన్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. ఎగ్జామినర్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్ & జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 65 ఖాళీలను ప్రకటించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది యూపీఎస్‌సీ. ఇప్పుడు మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను upsconline.nic.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు నవంబర్ 28 చివరి తేదీ.

UPSC Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 65

దరఖాస్తుకు చివరి తేదీ- నవంబర్ 28
విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉండాలి. ట్రేడ్ మార్క్స్, జియోగ్రాఫికల్ ఇండికేషన్స్‌కు సంబంధించిన వ్యవహారాలు, కోర్టు కేసులను నిర్వహించిన అనుభవం కనీసం రెండేళ్లు ఉండాలి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
వయస్సు- 30 ఏళ్ల లోపు. ఎస్సీ, ఎస్టీలకు 35 ఏళ్లు, ఓబీసీలకు 33 ఏళ్లు.


యూపీఎస్‌సీ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Honda Activa 125 BS6: కొత్త హోండా యాక్టీవా ఎలా ఉందో చూశారా?



ఇవి కూడా చదవండి:

SAIL Recruitment 2019: స్టీల్ అథారిటీలో 148 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Railway Jobs: రైల్వేలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... వివరాలివే

HCL Recruitment 2019: హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు... వివరాలివే
First published: November 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు