UPSC PREPARATION TIPS ARE YOU PREPARING FOR THE UPSC CIVILS EXAM THEN FOLLOW THESE TIPS FOR SUCCESS GH EVK
UPSC Preparation Tips: యూపీఎస్సీ సివిల్స్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారా?.. అయితే ఈ చిట్కాలతో విజయం సాధించండి
యూపీఎస్సీ
UPSC Preparation Tips: సివిల్ సర్వీసెస్ కోచింగ్‌కు పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. దీంతో ఆర్థికంగా వెనుకబడిన వారు, పేద విద్యార్థులు సొంతంగానే ప్రిపేర్ అవుతుంటారు. సొంత ప్రిపరేషన్ (Preparation)తో కూడా చాలా మంది సివిల్స్‌ను క్లియర్ చేస్తున్నారు. మీరు కూడా 2022లో జరిగే యూపీఎస్సీ పరీక్షను సొంతగా క్లియర్ చేయాలనుకుంటే.. ఈ చిట్కాలు పాటించండి.
దేశంలోనే అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS)ల నియామకం కోసం ఏటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ (Civil Service) పరీక్షకు లక్షలాది మంది పోటీ పడుతుంటారు. అత్యంత కఠినమైన పరీక్షగా పేరున్న సివిల్స్‌లో విజయం సాధించడం అంత సులభమేమీ కాదు. అందుకే ఏకాగ్రతతో ఈ పరీక్షకు సిద్ధమవుతుంటారు. అయితే అందులో కొందరు మాత్రమే విజయం సాధిస్తారు. విద్యార్థులను సివిల్ సర్వెంట్లుగా తీర్చిదిద్దేందుకు దేశంలో అనేక కోచింగ్ సెంటర్లు (Coaching Centers) అందుబాటులో ఉన్నాయి. వాటి మార్గదర్శకంలో అనేక మంది సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్దమవుతున్నారు. కానీ సివిల్ సర్వీసెస్ కోచింగ్‌కు పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. దీంతో ఆర్థికంగా వెనుకబడిన వారు, పేద విద్యార్థులు సొంతంగానే ప్రిపేర్ అవుతుంటారు. సొంత ప్రిపరేషన్ (Preparation) తో కూడా చాలా మంది సివిల్స్‌ను క్లియర్ చేస్తున్నారు. మీరు కూడా 2022లో జరిగే యూపీఎస్సీ (UPSC) పరీక్షను సొంతగా క్లియర్ చేయాలనుకుంటే.. ఈ చిట్కాలు పాటించండి.
సివిల్స్ క్లియర్ చేసేందుకు పాటించాల్సిన చిట్కాలు
- సివిల్స్ ప్రిపరేషన్‌కు అంకితభావం చాలా అవసరం. సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత (Qualify) సాధించాలంటే ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం చాలా అవసరం. కొంత కాలం ఇతర వ్యాపకాలు పక్కన పెట్టి ప్రిపరేషన్‌పైనే దృష్టి పెట్టాలి.
- మానసికంగా, శారీరకంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. మీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకోండి. దాన్ని సాధించడానికి కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండండి.
- సివిల్స్ క్లియర్ చేయడానికి సిలబస్‌ను సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యమైన పుస్తకాలు, సబ్జెక్టుల వారీగా సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అవసరం. వీలైతే సివిల్స్ క్లియర్ చేసిన వారి సలహాలు, గైడెన్స్ తీసుకోండి.
- సివిల్స్‌లో కరెంట్ అఫైర్స్ (Current Affairs) కు ఎక్కువ మార్కుల వెయిటేజీ ఉంటుంది. అందుకే అంతర్జాతీయ, జాతీయ అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోండి.
- యూపీఎస్సీ సివిస్లో ఒక ఆప్షనల్ సబ్జెక్టును ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనికి 500 మార్కులు కేటాయించారు. మీ ఆసక్తిని బట్టి సబ్జెట్ ఎంచుకోండి.
- 6 నుంచి 12వ తరగతి వరకు ఉన్న ఎన్సీఈఆర్టీ పుస్తకాలు మీ విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. వాటితో పాటు ఇతర పుస్తకాలనూ చదవండి.
చిన్న నోట్స్ తయారు చేసుకోండి. రివిజన్ సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. యూపీఎస్సీ ఇంటర్వ్యూ (Interview) లో మీ డిప్లమాటిక్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ (Communication Skills,), స్ట్రెస్ రెస్పాన్స్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. వాటిపై ఎక్కువ సాధన చేయండి.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షను ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ.. మొత్తం మూడు దశల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా ప్రిలిమినరీకి హాజరవ్వాల్సి ఉంటుంది. దీనిలో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ నిర్వహిస్తారు. మెయిన్స్ క్లియర్ చేసిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది. మెయిన్స్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. సివిల్స్‌కు సంబంధించిన సిలబస్, ఎగ్జామ్ పాటర్న్, ప్రిపరేషన్ టిప్స్‌కు సంబంధించిన మొత్తం సమాచారం www.upsc.gov.in లో అందుబాటులో ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.