UPSC Prelims Result 2020: యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

UPSC Prelims result 2020: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 2020 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) శుక్రవారం(అక్టోబర్ 23, 2020) రాత్రి విడుదల చేసింది. యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్(upsc.gov.in)లో పరీక్షా ఫలితాలను ఉంచారు.

news18-telugu
Updated: October 23, 2020, 11:56 PM IST
UPSC Prelims Result 2020: యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 2020 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) శుక్రవారం(అక్టోబర్ 23, 2020) రాత్రి విడుదల చేసింది. యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్(upsc.gov.in)లో పరీక్షా ఫలితాలను ఉంచారు. అక్టోబర్ 4న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలను యూపీఎస్సీ నిర్వహించింది. ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్షలకు అర్హత పొందుతారు. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులు దీని కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 28 నుంచి నవంబరు 11వ తేదీ సాయంత్రం 6 గం.లలోపు మెయిన్ పరీక్షల కోసం డీటైల్డ్ అప్లికేషన్ ఫాంను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది.

సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలను ఇక్కడ చెక్ చేసుకోండి...క్లిక్

పరీక్షా ఫలితాలకు సంబంధించి అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే దిగువున ఇచ్చిన నెంబర్లకు ఉదయం 10 గం.ల నుంచి సాయంత్రం 5 గం.ల మధ్య ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు.
ఫోన్ నెం. 011-23385271, 011-23098543 లేదా 011-23381125

అభ్యర్థుల సందేహాల నివృత్తికి న్యూఢిల్లీ, షార్జహాన్ రోడ్, ధోల్‌పూర్ హౌస్‌లోని ఎగ్జామినేషన్‌ హాల్‌కు సమీపంలో ప్రత్యేక కౌంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు.
Published by: Janardhan V
First published: October 23, 2020, 11:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading