UPSC NDA NA 2022 II UNION PUBLIC SERVICE COMMISSION RELEASED NATIONAL DEFENCE ACADEMY AND NAVAL ACADEMY EXAMINATION NOTIFICATION WITH 400 VACANCIES SS
UPSC NDA NA 2022: యూపీఎస్సీ నుంచి ఎన్డీఏ జాబ్ నోటిఫికేషన్... ఇంటర్ అర్హతతో 400 పోస్టులు
UPSC NDA NA 2022: యూపీఎస్సీ నుంచి ఎన్డీఏ జాబ్ నోటిఫికేషన్... ఇంటర్ అర్హతతో 400 పోస్టులు
(ప్రతీకాత్మక చిత్రం)
UPSC NDA NA 2022 | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో 400 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఇంటర్మీడియట్ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు.
ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) అండ్ నావల్ అకాడమీ (NA) ఎగ్జామినేషన్ కోసం జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. మొత్తం 400 పోస్టుల్ని ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2022 జూన్ 7 లోగా దరఖాస్తు చేయాలి. ఇంటర్మీడియట్ పాసైనవారు అప్లై చేయొచ్చు. 2022 సెప్టెంబర్ 4న ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూ ఉంటుంది. వారికి నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీలో శిక్షణ తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
UPSC NDA NA 2022: ఖాళీల వివరాలివే
మొత్తం ఖాళీలు
400
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఆర్మీ)
208 (మహిళలకు 10 పోస్టులు)
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (నేవీ)
42 (మహిళలకు 3 పోస్టులు)
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎయిర్ ఫోర్స్) ఫ్లయింగ్
92 (మహిళలకు 2 పోస్టులు)
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎయిర్ ఫోర్స్) గ్రౌండ్ డ్యూటీస్ టెక్
18 (మహిళలకు 2 పోస్టులు)
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎయిర్ ఫోర్స్) గ్రౌండ్ డ్యూటీస్ నాన్ టెక్
మహిళా అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామినేషన్‌లో మహిళలకు కూడా అవకాశం ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో మహిళలకు 19 పోస్టులు కేటాయించడం విశేషం. గతేడాది ఇదే నోటిఫికేషన్‌కు 1,70,000 మహిళా అభ్యర్థులు అప్లై చేయడం విశేషం.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.