డిఫెన్స్ రంగంలో ఉద్యోగాల (Jobs) కోసం ఎదురుచూస్తున్న యువతకు అలర్ట్. నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA)-I, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్(CDS)1 పరీక్ష-2023కు సంబంధించి యూపీఎస్సీ కీలక ప్రకటన జారీ చేసింది. ఈ ఎగ్జామ్ అప్లికేషన్ గడువును తాజాగా పొడిగించింది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం జనవరి 10తో గడువు ముగిసింది. కానీ ఇప్పుడు అభ్యర్థులకు జవనరి 12 వరకు అవకాశం కల్పించింది. NDA-I & CDS-I 2023 పరీక్ష దరఖాస్తు చివరి తేదీ అయిన జనవరి 10న సర్వర్ స్లో డౌన్ అయింది. దీంతో అభ్యర్థుల ప్రయోజాలను దృష్టిలో ఉంచుకుని జనవరి 12వ తేదీ సాయంత్రం 6:00 గంటల వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఈమేరకు యూపీఎస్సీ ఓ నోటీస్ జారీ చేసింది. దరఖాస్తు గడువు పొడిగింపుతో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in ద్వారా జనవరి 12వ తేదీ సాయంత్రం 6 గంటలోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అర్హత ప్రమాణాలు
యూపీఎస్సీ NDA- I & CDS I పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2004 జూలై 2 -2007 జూలై 1 మధ్య జన్మించిన అభ్యర్థుల మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గ్రాడ్యుయేట్స్ కూడా CDS పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నావల్ అకాడమీ కోసం ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ తప్పనిసరి పూర్తిచేసి ఉండాలి.
దరఖాస్తు విధానం
ముందుగా అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in ఓపెన్ చేయాలి. ఆ తరువాత హోమ్ పేజీలో అప్లై ఆన్‌లైన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీంతో న్యూ పేజీ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ ‘One Time Step Registration (OTR) for Examinations of UPSC’ అనే లింక్‌పై క్లిక్ చేయండి. అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) ఫ్లాట్ పామ్‌లో రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి.
ఇది పూర్తయిన తరువాత లాంగిన్ అవ్వడానికి ఇమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. అవసరమైన అన్ని వివరాలతో అప్లికేషన్‌ను నింపండి.
పేమెంట్ చేసే మందు అప్లికేషన్‌ను ఒకసారి క్రాస్-చెక్ చేసుకోండి. అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేసి సబ్‌మిట్ చేయండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను సేవ్ చేసుకోండి.
ఎడిట్ విండో ఆప్షన్ వివరాలు
దరఖాస్తుల్లో ఎర్రర్స్ ఉంటే ఎడిట్ చేయడానికి జనవరి 18 నుంచి 24వ తేదీ సాయంత్రం 6:30 గంటల వరకు అవకావశం ఉంటుంది. అడ్మిట్ కార్డులు పరీక్షకు మూడు వారాల ముందు అందుబాటులోకి రానున్నాయి. దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ఐడీని అందించాల్సి ఉంటుంది.
నెగెటివ్ మార్కింగ్
పరీక్ష ఆఫ్‌లైన్ మోడ్‌లో ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. పరీక్ష రోజు అభ్యర్థులు OMR షీట్స్‌లో ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. అభ్యర్థులు పరీక్షలో బ్లాక్ బాల్ పెన్ను మాత్రమే ఉపయోగించాలి. ఈ పరీక్ష ద్వారా ఆర్మీ , నేవీ, ఏయిర్‌ఫోర్స్ విభాగాల్లో ఈ మొత్తం 395 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో 19 పోస్టులను మహిళలకు రిజర్వ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, Exams, JOBS, UPSC