హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NDA Registration: నేషనల్ డిఫెన్స్ అకాడమీ రిక్రూట్‌మెంట్.. మరికొన్ని గంటల్లో ముగియనున్న దరఖాస్తుల గడువు..

NDA Registration: నేషనల్ డిఫెన్స్ అకాడమీ రిక్రూట్‌మెంట్.. మరికొన్ని గంటల్లో ముగియనున్న దరఖాస్తుల గడువు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎన్డీయే 1 2023 రిక్రూట్‌మెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటితో (జనవరి 10) ముగియనుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ 395 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పరీక్షలను నిర్వహిస్తుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

రక్షణ రంగంలో ఉద్యోగాల కోసం నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) గత నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎన్డీయే 1 2023 రిక్రూట్‌మెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటితో (జనవరి 10) ముగియనుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ 395 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పరీక్షలను నిర్వహిస్తుంది. 2022 డిసెంబర్ 21 నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఇంకా ఆసక్తి, అర్హత ఉండి దరఖాస్తు చేయని అభ్యర్ధులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ప్రతి సంవత్సరం ఎన్డీయే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. 2023 సంవత్సరానికి డిసెంబర్ 2022లోనే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 395 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆర్మీ , నేవీ, ఏయిర్‌ఫోర్స్ విభాగాల్లో ఈ మొత్తం 395 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టుల్లో 19 పోస్టులు మహిళలకు రిజర్వ్ అయి ఉంటాయి.

ఎలా అప్లై చేసుకోవాలి?

అభ్యర్ధులు యూవీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. యూపీఎస్సీ అఫిషియల్ వెబ్‌సైట్‌లో upsconline.nic.in లో లాగిన్ అవ్వాలి. వెబ్‌సైట్‌లో కొత్తగా లాగిన్ అయిన వారు ఓటీఆర్ రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో ‘యాక్టివ్ ఎక్జామినేషన్స్’ను సెలక్ట్ చేసుకొని అందులో ‘ఎన్డీయే 1 2023’ పై క్లిక్ చేయాలి.

Sankranti Holidays: విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచి సంక్రాంతి సెలవులు షురూ..

ముందుగా నోటిఫికేషన్ కాపీని డౌన్‌లోడ్ చేసుకొని చదవాలి. నోటిఫికేషన్‌లో అడిగిన విద్యార్హత, వయసు, డాక్యుమెంట్లు మీదగ్గర ఉన్నాయా అని చూసుకోవాలి. నిబంధనలకు తగినట్లుగా దరఖాస్తును పూర్తిచేయాలి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు ఫీజును చెల్లించిన తరువాత వెంటనే సబ్మిట్ చేయాలి. ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసిన ఎన్డీయే అప్లికేషన్ ఫారమ్‌ను ప్రింట్ అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకోవాలి. దీనితో మీ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.

 ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

విద్యార్హత, వయసుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో upsconline.nic.in ‘ఎన్డీయే 2023 నోటిఫికేషన్‌’ ద్వారా పొందవచ్చు. దరఖాస్తు చేయాలనుకునే పురుష, మహిళా అభ్యర్థులు వివాహం కాని వారై ఉండాలి. 2004, జులై 2 నుంచి 2007, జులై 1 మధ్య జన్మించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

గుర్తుంచుకోవాల్సిన తేదీలు..

దరఖాస్తు పూర్తయిన తరువాత వాటిని తిరిగి వెనక్కి తీసుకోవడానికి జనవరి 18 నుంచి జనవరి 24 వరకు అవకాశం ఉంటుంది. అప్లై చేసుకున్న తరువాత, ఆసక్తి లేని అభ్యర్థులు ఈ తేదీల్లో తమ అప్లికేషన్లను వెనక్కి తీసుకోవచ్చు. రాత పరీక్షను 2023, ఏప్రిల్ 16న నిర్వహించనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది.

అయితే ఈ నోటిఫికేషన్‌కు అప్లై చేసుకున్న అభ్యర్థులు అందరికీ పరీక్ష నిర్వహించరు. దరఖాస్తుల్లో అర్హత కలిగిన వారికి మాత్రమే హాల్‌టికెట్లను జారీ చేసి పరీక్షకు అనుమతిస్తారు. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని, ఆ తరువాత ఇంటర్వ్యూ, మెడికల్ ఇతర పరీక్షలకు పంపిస్తారు.

First published:

Tags: JOBS, NDA, Registrations

ఉత్తమ కథలు