Home /News /jobs /

UPSC IAS Mains 2021: సివిల్ సర్వీస్ మెయిన్స్ పరీక్ష దరఖాస్తుకు నేడే ఆఖరి తేదీ.. ఎలా అప్లై చేయాలంటే..?

UPSC IAS Mains 2021: సివిల్ సర్వీస్ మెయిన్స్ పరీక్ష దరఖాస్తుకు నేడే ఆఖరి తేదీ.. ఎలా అప్లై చేయాలంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

UPSC Recruitment 2021: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రధాన పరీక్షకు ధరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే ఆఖరి తేది.. సమయంలో ఎక్కువ లేదు కాబట్టి పరీక్ష రాద్దామనుకున్నవారు త్వరపడాల్సి ఉంది. అయితే ఎలా అప్లై చేయాలంటే..?

    UPSC IAS Mains 2021:  యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రధాన పరీక్ష వచ్చే 07 నుండి 16 వ తేదీ వరకు జరుగుతుంది. అయితే ఇందులో (UPSC IAS మెయిన్స్ 2021 DAF) దరఖాస్తు ప్రక్రియ నేటితో  ముగుస్తోంది. ఇంకా అప్లై చేయని అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఇవాళే ఆఖరి రోజు.. త్వరపడాల్సిన అవసరం ఉంది.  ఈ సందర్భంలో ఇంకా దీని కోసం దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.  ఐఏఎస్ (IAS)​, ఐపీఎస్​ (IPS) వంటి అత్యున్నత సివిల్​ సర్వెంట్ల భర్తీకి యూపీఎస్సీ (UPSC) ఏటా సివిల్​ సర్వీసెస్​ నోటిఫికేషన్​ (Notification) విడుదల చేస్తుందన్న విషయం తెలిసిందే. 2021 ఏడాదికి సంబంధించి ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షను పూర్తి చేసింది. త్వరలోనే మెయిన్స్​ పరీక్షను నిర్వహించనుంది. ఈ మెయిన్స్ పరీక్షను జనవరి 7, 8, 9, 15,16 తేదీల్లో నిర్వహించనుంది. అయితే ఈ సారి ఎగ్జామ్​ సెంటర్​ మార్పు విషయంలో ఆప్షన్​ ఇవ్వాలని అనేక మంది అభ్యర్థులు యూపీఎస్సీని కోరారు.

     సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష (UPSC IAS Mains 2021) రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం సెషన్ ఉదయం 9 నుండి 12 వరకు, మధ్యాహ్నం సెషన్ మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు ఉంటుంది. సివిల్ సర్వీసెస్‌లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.


    DAF అంటే ఏమిటి?
    UPSC వివిధ స్థాయిలలో సివిల్ సర్వీస్ పరీక్ష కోసం దరఖాస్తు ఫారమ్‌ను నింపాల్సి ఉంటుంది. ప్రిలిమ్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. అర్హత సాధించిన వారు ప్రధాన పరీక్ష కోసం ఒక ఫారమ్‌ను పూరించాలి. దీనిని డిటైల్డ్ అప్లికేషన్ ఫారమ్ (UPSC DAF 1) అంటారు. దీంతో పాటు పరీక్ష ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే UPSC సివిల్ సర్వీసెస్ ప్రధాన పరీక్ష జనవరి 7, 8, 9, 15, 16 తేదీల్లో జరుగుతుంది. మెయిన్ పరీక్షకు అడ్మిట్ కార్డ్ డిసెంబర్‌లో ప్రకటిస్తారు. మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. సూచనల ప్రకారం, UPSC మెయిన్స్ పరీక్ష కోసం DAF ఫారమ్ నింపడం నవంబర్ 23 నుండి ప్రారంభమైంది. డిఎఎఫ్ ఫారమ్ నింపని అభ్యర్థులు జనవరిలో జరిగే సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షకు హాజరు కాలేరు.

    అలాగే  అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని మెయిన్స్​ పరీక్ష కేంద్రాన్ని మార్చుకునే సదుపాయాన్ని కల్పించింది. మెయిన్స్​కు హాజరయ్యే అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాన్ని మార్పు చేసుకోవచ్చని, దీనికి సంబంధించి త్వరలోనే ఆప్షన్​ను అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. ఈ మేరకు www.upsc.gov.inలో ఒక ముఖ్యమైన నోటీసును విడుదల చేసింది.

    తాజా నిర్ణయం తీసుకున్నట్లు యూపీఎస్సీ తన అధికారిక వెబ్​సైట్​లో ఇది వరకే ప్రకటించింది. పేర్కొంది. త్వరలో ఈ ఆన్‌లైన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Civil Services, EDUCATION, JOBS, UPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు