UPSC: ఉద్యోగార్థుల కోసం యూపీఎస్సీ కొత్త హెల్ప్​లైన్ నంబర్.. సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం

ప్రతీకాత్మక చిత్రం

యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు పోటీపడే అభ్యర్థులు తాజా నోటిఫికేషన్ల సమాచారం, దరఖాస్తు విధానం, ఎగ్జామ్​ పాటర్న్​ వంటి వివరాలను, సందేహాలను 1800118711 టోల్​ఫ్రీ నంబర్​కు ఫోన్​ చేసి సులభంగా తెలుసుకోవచ్చు.

  • Share this:
నిరుద్యోగులకు యూపీఎస్సీ (UPSC) శుభవార్త చెప్పింది. వారి కోసం ప్రత్యేకంగా ఒక హెల్ప్​ లైన్​ నంబర్ (helpline number)​ను ఏర్పాటు చేసింది. యూపీఎస్సీ (UPSC) నిర్వహించే పరీక్షలకు పోటీపడే అభ్యర్థులు తాజా నోటిఫికేషన్ల సమాచారం, దరఖాస్తు విధానం, ఎగ్జామ్​ పాటర్న్​ (exam pattern) వంటి వివరాలను, సందేహాలను 1800118711 టోల్​ఫ్రీ నంబర్​ (toll-free number)కు ఫోన్​ చేసి సులభంగా తెలుసుకోవచ్చు. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 'ఆజాది కా అమృత్ మహోత్సవ్ (Azadi ka Amrit Mahotsav)' వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు యూపీఎస్సీ (UPSC) పేర్కొంది. షెడ్యూల్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగ (ST), ఇతర వెనుకబడిన తరగతులు (OBC), ఆర్థికంగా బలహీన వర్గాలు (EWS), వికలాంగ (PwBD) అభ్యర్థులకు సహాయం చేయాలనే లక్ష్యంతో యూపీఎస్సీ ఈ 'హెల్ప్‌లైన్' నంబర్‌ను ప్రారంభించింది.

పైన పేర్కొన్న (SC/ST/OBC/EWS/PwBD candidates and others ) కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఏదైనా పరీక్ష/ నియామకం లేదా కమిషన్ పరీక్షలు/ నియామకాలకు సంబంధించిన సందేహాలుంటే (doubts) టోల్​ఫ్రీ నంబర్​కు కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. ఈ యూపీఎస్సీ హెల్ప్​లైన్​ నంబర్​ (help lone number)ర్​ ఆఫీసు సమయంలో అన్ని పనిదినాల్లో పనిచేస్తుంది. యూపీఎస్సీ ఏటా నిర్వహించే పరీక్షలకు గ్రామీణ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు (candidates) సైతం పోటీ పడుతుంటారు. అటువంటి వారు పరీక్ష దరఖాస్తు ఫారమ్ నింపడంలో ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని యూపీఎస్సీ (UPSC) ఈ కొత్త టోల్​ ఫ్రీ నంబర్​ను ప్రారంభించింది.

సందేహాల నివృత్తి కోసం టోల్​ఫ్రీ నంబర్​ ఏర్పాటు..

యూపీఎస్సీ సివిల్​ సర్వీసెస్ (CIVIL services)​, ఇంజినీరింగ్​ సర్వీసెస్ (Engineering services)​, కంబైన్డ్​ డిఫెన్స్​ సర్వీసెస్ (CDS)​ నోటిఫికేషన్ల ద్వారా దేశంలోనే అత్యున్నత స్థాయి ఉద్యోగులను ఎంపిక చేస్తుంది. బ్యూరోక్రాట్లు, దౌత్యవేత్తలు, పోలీసులు అధికారులు, ఐఏఎస్ (IAS)​, ఐపీఎస్​ (IPS)వంటి అత్యున్నత స్థాయి అధికారులను నియమించడానికి సివిల్ సర్వీసెస్​ పరీక్ష (Civil service exam)లను నిర్వహిస్తోంది. ఇంజనీర్ల భర్తీకి ఐఈఎస్ (IES), డిఫెన్స్​ అధికారులను నియమించేందుకు కంబైన్డ్​ డిఫెన్స్​ సర్వీసెస్​ (సీడీఎస్​) పరీక్షను నిర్వహిస్తోంది.

ఇవి కూడా చదవండి:  26 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌ ఇన్‌ఫ్లూయన్సర్ల డేటా లీక్​.. గుర్తించిన సెక్యూరిటీ పరిశోధకులు

ఈ పోస్టులకు ప్రతి ఏటా జాబ్​ క్యాలెండర్​ ప్రకారం క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. తద్వారా లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు (candidates) సమాజంలో ఉన్నతస్థాయి గౌరవంతో పాటు ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తాయి.

ఇది కూడా చదవండి:

NFL​​లో 183 నాన్ ఎగ్జిక్యూటివ్​ పోస్టులకు నోటిఫికేషన్.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలివే!

First published: