ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS), నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) అండ్ నావల్ అకాడమీ (NA) కోసం రెండు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ నోటిఫికేషన్ ద్వారా 339 పోస్టుల్ని, ఎన్‌డీఏ, ఎన్ఏ నోటిఫికేషన్ ద్వారా 400 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 739 పోస్టులు ఉన్నాయి. ఇంటర్మీడియట్, డిగ్రీ పాసైనవారు అప్లై చేయొచ్చు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. అప్లై చేసేముందు నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా చదివి తెలుసుకోవాలి.
ఈ రెండు నోటిఫికేషన్ల ద్వారా 739 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది యూపీఎస్‌సీ. 2022 జూన్ 7 సాయంత్రం 6 గంటల్లోగా అప్లై చేయాలి. 2022 జూన్ 14 నుంచి 2022 జూన్ 20 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తుల్ని ఉపసంగరించుకోవచ్చు. 2022 సెప్టెంబర్ 4న ఎగ్జామ్ ఉంటుంది. ఎంపికైనవారికి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పోస్టింగ్ ఉంటుంది. 2023 జూలైలో కోర్సు ప్రారంభం అవుతుంది. మరి ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.
యూపీఎస్‌సీ CDS జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
యూపీఎస్‌సీ NDA NA జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Railway Jobs: నిరుద్యోగులకు అలర్ట్... 72,000 పోస్టుల్ని తొలగించిన భారతీయ రైల్వే
Story 1- అభ్యర్థులు యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://upsconline.nic.in/ ఓపెన్ చేయాలి.
Story 2- హోమ్ పేజీలో ONLINE APPLICATION FOR VARIOUS EXAMINATIONS OF UPSC లింక్ క్లిక్ చేయాలి.
Story 3- లిస్ట్‌లో Combined Defence Services Examination (II), National Defence Academy & Naval Academy Examination (II) నోటిఫికేషన్లు ఉంటాయి.
Story 4- రిజిస్ట్రేషన్ లింక్స్ వేర్వేరుగా ఉంటాయి.
Story 5- అభ్యర్థి ఏ నోటిఫికేషన్‌కు అప్లై చేయాలనుకుంటే ఆ నోటిఫికేషన్‌కు సంబంధించిన Click Here for PART I పైన క్లిక్ చేయాలి.
Story 6- పార్ట్ 1 రిజిస్ట్రేషన్‌లో అభ్యర్థి వివరాలు ఎంటర్ చేయాలి.
Story 7- ఆ తర్వాత పేమెంట్ పూర్తి చేసి ఫోటో, సంతకం, ఐడీ కార్డ్ అప్‌లోడ్ చేయాలి.
Story 8- ఆ తర్వాత సెంటర్ సెలక్షన్ చేసి పార్ట్ 1 రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
Story 9- పార్ట్ 2 రిజిస్ట్రేషన్ కోసం Click Here for Part II పైన క్లిక్ చేయాలి.
Story 10- రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టిన తేదీ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
Story 11- ఆ తర్వాత పార్ట్ 2 రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
Story 12- అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, Indian Air Force, Indian Army, Indian Navy, JOBS, UPSC