UPSC Jobs: ఫారెస్ట్ సర్వీస్‌లో ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్

Indian Forest Service Exam 2020 | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ 2020 నోటిఫికేషన్ విడుదల చేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC. నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: February 14, 2020, 3:22 PM IST
UPSC Jobs: ఫారెస్ట్ సర్వీస్‌లో ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్
UPSC Jobs: ఫారెస్ట్ సర్వీస్‌లో ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-CSE 2020 నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా 796 పోస్టుల్ని భర్తీ చేయనుంది యూపీఎస్‌సీ. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ అడ్మినిస్ట్రేటీవ్ సర్వీసెస్-IAS, ఇండియన్ పోలీస్ సర్వీసెస్-IPS, ఇండియన్ ఫారిన్ సర్వీసెస్-IFS లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తుంది. దీంతో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్-IFS పోస్టుల భర్తీకి వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది యూపీఎస్‌సీ. 90 పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్‌కు దరఖాస్తు చేసే అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఉంటాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలనుకునే అభ్యర్థులు కామన్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేయొచ్చు.

UPSC IFS 2020: నోటిఫికేషన్ వివరాలివే...



మొత్తం ఖాళీలు- 90
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 12
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 3 సాయంత్రం 6 గంటలు
వయస్సు- 21 నుంచి 32 ఏళ్లు
దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.విద్యార్హత- యానిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, బాటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ సబ్జెక్ట్స్‌తో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఇంజనీరింగ్ పాసై ఉండాలి.

ఐఎఫ్ఎస్ 2020 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Indian Army Jobs: ఇండియన్ ఆర్మీలో 191 జాబ్స్... ఫిబ్రవరి 20 లాస్ట్ డేట్

AIIMS Recruitment 2020: ఎయిమ్స్‌లో 418 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Indian Air Force: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో క్లర్క్, మేనేజర్ జాబ్స్
First published: February 14, 2020, 3:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading