హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UPSC Recruitment 2022: యూపీఎస్సీ నుంచి 327 పోస్టులకు నోటిఫికేషన్.. రేపటితో ముగుస్తున్న గడువు..

UPSC Recruitment 2022: యూపీఎస్సీ నుంచి 327 పోస్టులకు నోటిఫికేషన్.. రేపటితో ముగుస్తున్న గడువు..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

UPSC Recruitment 2022: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( UPSC ) ఇంజనీరింగ్ సర్వీసెస్ 2023 కోసం అధికారిక నోటిఫికేషన్‌ను(Notification) విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ అంటే upsc.gov.in లేదా upsconline.nic.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( UPSC ) ఇంజనీరింగ్ సర్వీసెస్ 2023 కోసం అధికారిక నోటిఫికేషన్‌ను(Notification) విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ అంటే upsc.gov.in లేదా upsconline.nic.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. UPSC ESE నోటిఫికేషన్ 2023కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు రుసుము(Application Fee), ఎలా దరఖాస్తు(Application) చేయాలి మొదలైన అన్ని వివరాలను ఇక్కడ తెలుసుకోండి. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 04 అక్టోబర్ 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అంటే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ అనేది రేపటితో ముగియనుంది.

సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో 327 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత ట్రేడ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తు సమర్పించడానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి. జనరల్ , ఓబీసీ అభ్యర్థుల రూ.200 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. రిజర్వేషన్ అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు .

Postal Jobs 2022: గుడ్ న్యూస్.. పోస్టల్ డిపార్ట్ మెంట్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..

ఆన్‌లైన్ విధానంలోనే పరీక్ష ఫీజును చెల్లించాలి. డెబిట్ కార్డ్ , క్రెడిట్ కార్డ్ , నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.

ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (IES)ని ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ESE) అని కూడా అంటారు. వివిధ మంత్రిత్వ శాఖలు , ప్రభుత్వ విభాగాల కింద ఇంజనీర్లుగా ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అత్యంత పోటీతత్వ, గౌరవప్రదమైన ఉద్యోగంగా పరిగణించబడుతుంది.

భారత ప్రభుత్వం నియమించబడిన IES ఇంజనీర్‌లను గ్రూప్ A విభాగాలలో పని చేయడానికి కేటాయించింది. అక్కడ వారు సాంకేతిక , నిర్వహణ విధులను పర్యవేక్షిస్తారు.

APPSC 5 Notifications: APPSC నుంచి 5 నోటిఫికేషన్లు.. అర్హత, చివరి తేదీ, పోస్టుల వివరాలిలా..

ప్రతి సంవత్సరం UPSC కింది 4(నాలుగు) ఇంజనీరింగ్ బ్రాంచ్‌లకు ఇంజనీర్లను ఎంపిక చేయడానికి ESE పరీక్షను నిర్వహిస్తుంది. IES సివిల్ ఇంజనీరింగ్, IES మెకానికల్ ఇంజనీరింగ్, ESE ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ESE ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఎంపికలు ఉంటాయి.

రాత‌ప‌రీక్ష, ఇంటర్వ్యూ/పర్సనల్ టెస్ట్, మెడికల్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ప‌రీక్షను రెండు దశల్లో నిర్వహిస్తారు. ప్రిలిమిన‌రీ (స్టేజ్‌-1), మెయిన్స్ (స్టేజ్-2). ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన‌వారిని మెయిన్‌ ప‌రీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్స్ వచ్చిన మార్కులను ఆధారంగా స్టేజ్-3 పర్సనాలిటి టెస్ట్(ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు.

ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 500 మార్కులు ఉంటాయి. వీటిలో 200 మార్కులకు పేపర్-1 (జనరల్ స్టడీస్ అండ్ ఇంజినీరింగ్ ఆప్టిట్యూడ్), 300 మార్కులకు పేపర్-2 (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్) పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి.

BCCL Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్..

మెయిన్ పరీక్ష మొత్తం 600 మార్కులకు ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. వీటిలో 300 మార్కులకు పేపర్-1 (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్), 300 మార్కులకు పేపర్-2 (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్) పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు 3 గంటల చొప్పున సమయం కేటాయిస్తారు. పూర్తి వివరాలకు upsconline.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, UPSC

ఉత్తమ కథలు