దేశంలో చాలా మంది నిరుద్యోగులు యూపీఎస్సీ (UPSC) పరీక్షల్లో సత్తా చాటాలని చూస్తారు. కానీ కొంత మంది మాత్రమే ఈ సివిల్ (Civil) సర్వీసెస్‌లో సక్సెస్ అవుతారు. ఈ ఎగ్జామ్ చాలా టఫ్‌గా ఉంటుంది. ఈ పరీక్ష కోసం అభ్యర్థులు నిద్రహారాలు మానేసి కూడా చదువుతుంటారు. అయినా పరీక్షలో సక్సెస్ అవుతారనే గ్యారంటీ మాత్రం ఉండదు. యూపీఎస్సీ పరీక్షలను ఫస్ట్ అటెంప్ట్ (First Attempt) లోనే క్లియర్ చేసేవారు చాలా తక్కువ మందే ఉంటారు. ఇది చాలా మందికి అసాధ్యంగా అనిపిస్తుంది. కానీ కొద్ది మంది మాత్రం చక్కని ప్రిపరేషన్‌తో బెస్ట్ రిజల్ట్ సాధిస్తారు. క్వాలిటీ స్టడీ మెటీరియల్, బెస్ట్ ప్లానింగ్‌తో కొందరు విజయం సాధిస్తారు.
చాలా మంది దరఖాస్తుదారులు ప్రిపరేషన్‌లో సరైన బుక్స్ ఎంచుకోకుండా చతికిలపడతారు. యూపీఎస్సీ పరీక్షలు రాసే వారికి NCERT బుక్స్ అనేవి చాలా ముఖ్యం. 6 నుంచి 12 తరగతుల వరకు NCERT బుక్స్ అభ్యర్థులు తప్పకుండా చదవాలి. అప్పుడే అనేక అంశాల మీద సరైన గ్రిప్ ఉంటుంది. టైం ఎక్కువ లేకపోతే 6 నుంచి 12 తరగతుల సిలబస్ చదవాల్సిన అవసరం లేదు. మీకు తక్కువ టైం ఉంటే కేవలం 9 నుంచి 12 తరగతుల NCERT బుక్స్ చదివితే సరిపోతుంది.
రివిజన్ కూడా ముఖ్యమే
యూపీఎస్సీకి(UPSC) ప్రిపేర్(Preparation) అయేటపుడు మరో ముఖ్య విషయం రివిజన్. మనం చదివిన అంశాలను చివరిసారిగా రివిజన్ చేసుకోవడం చాలా ఉపయోగం ఉంటుంది. మనం మొదటి సారి చదివేటపుడే అందుకు సంబంధించిన షార్ట్ నోట్స్ ను తయారు చేసుకోవాలి. నోట్స్ లో కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే రాసుకోవాలి. రివిజన్ చేసేటప్పుడు కేవలం మనం రాసుకున్న నోట్స్ ను చదివితే సరిపోతుంది. ఈ సింపుల్ టెక్నిక్స్ ను పాటించి యూపీఎస్సీ పరీక్షల్లో సరైన విధంగా పర్ఫామ్ చేయండి. యూపీఎస్సీ పరీక్షలు కష్టంతో కూడుకున్నవే.. కానీ సరైన ప్రణాళిక ప్రకారం చదివితే అంత కష్టమైన పనేం కాదు అని అనిపిస్తుంది.
ఈ ఏడాది ఎప్పుడు?
సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మొత్తం మూడు దశల్లో జరుగుతుంది. ముందు ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్లియర్ చేసిన వారు మెయిన్స్ రాయాల్సి ఉంటుంది. దీంట్లో టాప్‌లో నిలిచిన వారిని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ప్రతి సంవత్సరం ఈ రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. 2022 UPSC ప్రిలిమినరీ ఎగ్జామ్ జూన్ 5న జరగనుంది. మెయిన్స్ ఎగ్జామ్ సెప్టెంబర్ 16 నుంచి జరగనుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ డేట్స్, ఫైనల్ సెలక్షన్స్ ప్రాసెస్ వివరాలను యూపీఎస్సీ ప్రకటిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.