హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Exam Calendar: గుడ్ న్యూస్.. ఎగ్జామ్ క్యాలెండర్-2023 విడుదల.. ఏ పరీక్ష ఏ తేదీన ఉందో తెలుసుకోండి..

Exam Calendar: గుడ్ న్యూస్.. ఎగ్జామ్ క్యాలెండర్-2023 విడుదల.. ఏ పరీక్ష ఏ తేదీన ఉందో తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వచ్చే ఏడాదికి సంబంధించిన పోటీ పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఇందులో కొన్ని ప్రిలిమ్స్, మెయిన్స్ కలిపి మొత్తం 18 పరీక్షల‌కు సంబంధించిన వివరాలను ప్రకటించింది.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వచ్చే ఏడాదికి సంబంధించిన పోటీ పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఇందులో కొన్ని ప్రిలిమ్స్, మెయిన్స్ కలిపి మొత్తం 18 పరీక్షల‌కు సంబంధించిన వివరాలను ప్రకటించింది. ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్ష(Civil Services Exam)- 2023 మేలో జరగనుంది. ఒకవేళ ప‌రిస్థితులు అనుకూలంగా లేకపోతే పరీక్షల తేదీలు మారే అవ‌కాశం ఉంద‌ని యూపీఎస్సీ తెలిపింది.

యూపీఎస్సీ క్యాలెండర్‌-2023 ముఖ్యమైన పరీక్షల వివరాలు

యూపీఎస్సీ సివిల్ సర్వీస్, ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్షలు మే 28, 2023 జరగనున్నాయి. ఈ రెండు పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 1, 2023న జారీ చేస్తారు. ఫిబ్రవరి 21, 2023లోపు దరఖాస్తు చేసుకోవాలి.

* సివిల్స్ మెయిన్స్ పరీక్ష

సివిల్ సర్వీసెస్ (మెయిన్స్) పరీక్షలు సెప్టెంబర్15, 2023 నుంచి ప్రారంభమై 5 రోజుల పాటు కొనసాగునున్నాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (మెయిన్స్) పరీక్ష నవంబర్ 26, 2023న జరగనుంది.

ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) పరీక్షను ఫిబ్రవరి19, 2023న నిర్వహించనున్నారు. కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (మెయిన్) పరీక్షను యూపీఎస్సీ జూన్ 24, 2023లో నిర్వహించనుంది.

* NDA, CDS పరీక్షలు

NDA NA-I 2023, CDS-I 2023 పరీక్షల నోటిఫికేషన్‌ను డిసెంబర్ 21, 2022న యూపీఎస్సీ విడుదల చేయనుంది. జనవరి 10, 2023లోపు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు పరీక్షలను ఏప్రిల్ 16, 2023న నిర్వహిస్తారు. ఇక NDA-II, CDS-II కోసం నోటిఫికేషన్ మే 17, 2023న విడుదల కానుంది. జూన్ 6, 2023లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ రెండు పరీక్షలను సెప్టెంబర్3,2023లో జరగనున్నాయి. CAPF అసిస్టెంట్ కమాండెంట్ రిక్రూట్‌మెంట్ - 2023 పరీక్ష నోటిఫికేషన్ ఏప్రిల్ 26, 2023న విడుదల కానుంది. మే16, 2023 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పరీక్షను ఆగస్టు6, 2023న నిర్వహించనుంది.

యూపీఎస్సీ క్యాలెండర్ -2023 ప్రకారం చాలా పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్‌లు 2022లోనే జారీ కానున్నాయి. సెప్టెంబర్‌లో ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్షతో పాటు కంబైన్డ్ జియో-సైంటిస్ట్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ ఏడాది నవంబర్‌లో సీబీఐ, సీఐఎస్‌ఎఫ్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్లు యూపీఎస్సీ విడుదల చేయనుండగా, డిసెంబర్‌లో ఎన్‌డీఏ, సీడీఎస్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌లు వెలువడనున్నాయి.

ఈ ఏడాది (2022) విడుదల అయిన సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఇంకా తెరిచి ఉంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 10లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. యూపీఎస్సీ అధికారిక వైబ్‌సైట్upsc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పరీక్ష ఆగస్టు 7, 2022న దేశవ్యాప్తంగా జరగనుంది.

అభ్యర్థులు పరీక్షల క్యాలెండర్ -2023 అనుసరించి దరఖాస్తు చేసుకొని ప్రకటించిన తేదీల ప్రకారం పరీక్షలకు హాజరుకావాలని యూపీఎస్సీ సూచించింది. ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే పరీక్ష తేదీలు మారే అవకాశం ఉందని, అప్‌డేట్స్ కోసం తరచూ వెబ్‌సైట్‌ను సందర్శించాలని యూపీఎస్సీ స్పష్టం చేసింది.

First published:

Tags: Career and Courses, Entrance exams, Exams, UPSC

ఉత్తమ కథలు