హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UPSC ESIC Recruitment 2021: రూ.1,70,000 వేతనంతో ఈఎస్ఐలో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

UPSC ESIC Recruitment 2021: రూ.1,70,000 వేతనంతో ఈఎస్ఐలో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

UPSC ESIC Recruitment 2021: రూ.1,70,000 వేతనంతో ఈఎస్ఐలో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

UPSC ESIC Recruitment 2021: రూ.1,70,000 వేతనంతో ఈఎస్ఐలో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

UPSC ESIC Recruitment 2021 | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC ఈఎస్ఐలో ఉద్యోగాల (ESI Jobs) భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. నోటిఫికేషన్ వివరాలతో పాటు ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్-ESIC డిప్యూటీ డైరెక్టర్ పోస్టుల్ని (ESI Jobs) భర్తీ చేస్తోంది. మొత్తం 151 ఖాళీలున్నాయి. ఈ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC కొన్ని రోజుల క్రితమే జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ (Application Process) కొనసాగుతోంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి 2021 సెప్టెంబర్ 2 చివరి తేదీ. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు జాబ్ నోటిఫికేషన్‌లో (Job Notification) పూర్తి వివరాలు చదివి తెలుసుకోవాలి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. మరి ఈ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకోండి.

మొత్తం ఖాళీలు151
అన్‌రిజర్వ్‌డ్66
ఎస్‌సీ23
ఎస్‌టీ9
ఓబీసీ38
ఈడబ్ల్యూఎస్15
దివ్యాంగులు4


UBI Recruitment 2021: రూ.78,000 వేతనంతో యూనియన్ బ్యాంక్‌లో 347 ఉద్యోగాలు

UPSC ESIC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 2

దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 3

విద్యార్హతలు- అభ్యర్థులు డిగ్రీ పాస్ కావాలి.

అనుభవం- ఏదైనా ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలో అకౌంట్స్, మార్కెటింగ్, ఇన్స్యూరెన్స్, పబ్లిక్ రిలేషన్ విభాగాల్లో కనీసం 3 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.

వయస్సు- 35 ఏళ్లు.

దరఖాస్తు ఫీజు- రూ.25.

ఎంపిక విధానం- రాతపరీక్ష, ఇంటర్వ్యూ

పరీక్షా విధానం- పరీక్ష రెండు గంటలు ఉంటుంది. పార్ట్‌ ఏలో ఇంగ్లీష్, పార్ట్ బీలో జనరల్ ఎబిలిటీపై ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో క్వాలిఫై అయినవారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు.

వేతనం- ఏడో పే కమిషన్‌ పే మ్యాట్రిక్స్‌లో లెవెల్ 10 వర్తిస్తుంది. రూ.56,100 బేసిక్ వేతనంతో మొత్తం రూ.1,77,500 వేతనం లభిస్తుంది.

NIACL Recruitment 2021: రూ.62,000 వేతనంతో ప్రభుత్వ ఇన్స్యూరెన్స్ కంపెనీలో 300 జాబ్స్

UPSC Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా...


Step 1- అభ్యర్థులు ముందుగా యూపీఎస్‌సీ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ https://upsconline.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో ONLINE RECRUITMENT APPLICATION (ORA) FOR VARIOUS RECRUITMENT POSTS పైన క్లిక్ చేస్తే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కనిపిస్తాయి.

Step 3- అందులో Deputy Director పోస్టుకు సంబంధించిన Apply Now లింక్ క్లిక్ చేయాలి.

Step 4- ఆ తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి.

Step 5- అభ్యర్థి తన వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

Step 6- దరఖాస్తు ఫామ్ పూర్తి చేసిన తర్వాత ఫీజు చెల్లించాలి.

Step 7- దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

First published:

Tags: CAREER, Govt Jobs 2021, Job notification, JOBS

ఉత్తమ కథలు