హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UPSC Engineering Services: యూపీఎస్సీ ఇంజినీరింగ్​ సర్వీసెస్​ నోటిఫికేషన్ విడుదల.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ, పూర్తి వివరాలివే..

UPSC Engineering Services: యూపీఎస్సీ ఇంజినీరింగ్​ సర్వీసెస్​ నోటిఫికేషన్ విడుదల.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ, పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

UPSC తాజాగా ఇండియన్​ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్​)–2022 నోటిఫికేషన్(Job Notification)​ విడుదల చేసింది. ఇంజినీరింగ్​ విభాగాల్లో 247 ఉన్నత స్థాయి పోస్టులను ఈ నోటిఫికేషన్​ ద్వారా భర్తీ చేయనున్నారు. సివిల్​, మెకానికల్​, ఎలక్ట్రికల్​, ఎలక్ట్రానిక్స్​ అండ్​ టెలీ కమ్యూనికేషన్ తదితర​ ఇంజినీరింగ్​ విభాగాల్లో ఈ పోస్టులను(Jobs) భర్తీ చేయనున్నారు.

ఇంకా చదవండి ...

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తాజాగా ఇండియన్​ ఇంజనీరింగ్ సర్వీసెస్ (Indian Engineering Services-IES​)–2022 నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఇంజినీరింగ్(Engineering)​ విభాగాల్లో 247 అత్యున్నత పోస్టులను ఈ నోటిఫికేషన్​ ద్వారా భర్తీ చేయనున్నారు. సివిల్​, మెకానికల్​, ఎలక్ట్రికల్​, ఎలక్ట్రానిక్స్​ అండ్​ టెలీ కమ్యూనికేషన్​ ఇంజినీరింగ్​ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ నోటిఫికేషన్(Notification) కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్​ పూర్తి చేసి ఉండాలి. లేదా బీఈ/బీటెక్​ ఫైనలియర్​ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు గల వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులందరూ www.upsconline.nic.in వెబ్​సైట్​ ద్వారా అక్టోబర్ 12లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ. 200 అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ పీహెచ్​ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఐఈఎస్​ ప్రిలిమ్స్​ పరీక్షను 2022 ఫిబ్రవరి 20న నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్​, తిరుపతి, విశాఖపట్నంలో పరీక్ష ఉంటుంది.

సెలక్షన్​ ప్రాసెస్.. (Selection Process)

ఇంజినీరింగ్​ సర్వీసెస్​ ఎగ్జామ్​ను మొత్తం మూడు దశల్లో నిర్వహిస్తారు. ముందుగా ప్రిలిమ్స్ పరీక్ష​ ఉంటుంది. ప్రిలిమ్స్​లో అర్హత సాధించిన వారికి మెయిన్స్​ పరీక్ష ఉంటుంది. మెయిన్స్​ కూడా క్లియర్​ చేసిన అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్/ ఇంటర్వ్యూ నిర్వహించి మెరిట్​ లిస్ట్​ ప్రిపేర్​ చేస్తారు. ప్రిలిమ్స్​కు 500 మార్కులు, మెయిన్స్​కు-600 మార్కులు, పర్సనాలిటీ టెస్ట్-కు 200 మార్కులు కేటాయించారు. మొత్తం 1300 మార్కులకు పరీక్ష ఉంటుంది.

ఇదీ చదవండి: TCS Recruitment: టీసీఎస్ అతిపెద్ద రిక్రూట్‌మెంట్ డ్రైవ్.. దరఖాస్తు చేసుకోండి ఇలా

ప్రిలిమ్స్​లో పేపర్​1, పేపర్​ 2 ఉంటాయి. పేపర్​ 1 పూర్తిగా ఆబ్జెక్టివ్​ విధానంలో ఉంటుంది. పేపర్​ 2 డిస్క్రిప్టివ్​ విధానంలో ఉంటుంది. ఈ నోటిఫికేషన్​ ద్వారా ఇండియన్ డిఫెన్స్ సర్వీస్, ఇండియన్ రేడియో రెగ్యులేటరీ సర్వీస్, ఇండియన్ రైల్వే, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్, మిలిటరీ ఇంజనీరింగ్, సెంట్రల్ వాటర్, సెంట్రల్ ఇంజనీరింగ్, నేవల్, సెంట్రల్ పవర్, టెలికాం, బోర్డర్ రోడ్స్ ఇంజనీరింగ్ సర్వీసెస్, స్కిల్ డెవలప్‌మెంట్ సర్వీసెస్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు తదితర విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. వీరికి ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం రూ.70వేల నుంచి రూ.75వేల వరకు ప్రారంభ వేతనం అందుతుంది. దీనికి అదనంగా అలవెన్సులు కూడా ఉంటాయి.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Exams, Government jobs, Job notification, JOBS, UPSC

ఉత్తమ కథలు