హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UPSC Recruitment 2020: 347 పోస్టులతో యూపీఎస్‌సీ నోటిఫికేషన్

UPSC Recruitment 2020: 347 పోస్టులతో యూపీఎస్‌సీ నోటిఫికేషన్

UPSC Recruitment 2020: 347 పోస్టులతో యూపీఎస్‌సీ నోటిఫికేషన్
(ప్రతీకాత్మక చిత్రం)

UPSC Recruitment 2020: 347 పోస్టులతో యూపీఎస్‌సీ నోటిఫికేషన్ (ప్రతీకాత్మక చిత్రం)

UPSC Recruitment 2020 | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోరుకునేవారికి శుభవార్త. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. యూపీఎస్‌సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-ESE 2020 మెయిన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పటికే ప్రిలిమ్స్ పాస్ అయినవారు మెయిన్ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 347 ఖాళీలను భర్తీ చేయబోతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అప్లై చేయడానికి 2021 జనవరి 5 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.upsc.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

  UPSC Recruitment ESE 2020: ఖాళీల వివరాలు ఇవే...


  మొత్తం ఖాళీలు- 347

  సివిల్ ఇంజనీరింగ్- 147

  ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 85

  ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 74

  మెకానికల్ ఇంజనీరింగ్- 41

  Indian Navy Jobs: ఇండియన్ నేవీలో 210 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  AICTE Scholarship: నెలకు రూ.12,400 స్కాలర్‌షిప్... దరఖాస్తుకు డిసెంబర్ 31 చివరి తేదీ

  UPSC Recruitment ESE 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  దరఖాస్తు ప్రారంభం- 2020 డిసెంబర్ 24

  దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 5 సాయంత్రం 6 గంటలు

  విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

  ఎంపిక విధానం- ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, పర్సనాలిటీ టెస్ట్.

  ECIL Hyderabad Jobs: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో జాబ్స్... డిసెంబర్ 31 లాస్ట్ డేట్

  Railway Jobs: ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్ రాస్తున్నారా? ఈ రూల్ మీకు తెలుసా?

  UPSC Recruitment ESE 2020: అప్లై చేయండి ఇలా


  అభ్యర్థులు ముందుగా https://www.upsc.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

  హోమ్ పేజీలో Whats New సెక్షన్‌లో Engineering Service Main DAF పైన క్లిక్ చేయాలి.

  కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్, ఖాళీల వివరాలు ఉంటాయి.

  ENGINEERING SERVICES (MAIN) EXAMINATION , 2020 పైన క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

  లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.

  మీ వివరాలతో ఫామ్ పూర్తి చేయాలి.

  అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

  దరఖాస్తు సబ్మిట్ చేసే ముందు వివరాలు ఓసారి సరిచూసుకోవాలి.

  దరఖాస్తు సబ్ిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION, UPSC

  ఉత్తమ కథలు