UPSC Jobs: 597 పోస్టుల్ని భర్తీ చేస్తున్న యూపీఎస్‌సీ... దరఖాస్తుకు 2 రోజులే గడువు

UPSC ESE 2020 | ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో 495 ఖాళీలున్నాయి. వాటిలో 21 పోస్టుల్ని పర్సన్స్ విత్ బెంచ్‌మార్క్ డిసెబిలిటీస్‌కు కేటాయించారు.

news18-telugu
Updated: October 13, 2019, 6:39 PM IST
UPSC Jobs: 597 పోస్టుల్ని భర్తీ చేస్తున్న యూపీఎస్‌సీ... దరఖాస్తుకు 2 రోజులే గడువు
UPSC Jobs: 597 పోస్టుల్ని భర్తీ చేస్తున్న యూపీఎస్‌సీ... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో 495, జియో సైంటిస్ట్ విభాగంలో 102 పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ వేర్వేరుగా జారీ చేసిన నోటిఫికేషన్లను upsc.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుకు అక్టోబర్ 15 చివరి తేదీ. ప్రిలిమినరీ ఎగ్జామ్ జనవరి 5న జరగనుంది. ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో 495 ఖాళీలున్నాయి. వాటిలో 21 పోస్టుల్ని పర్సన్స్ విత్ బెంచ్‌మార్క్ డిసెబిలిటీస్‌కు కేటాయించారు. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది యూపీఎస్సీ. ఇక కంబైన్డ్ జియో సైంటిస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2020 వివరాలు చూస్తే మొత్తం 102 ఖాళీలున్నాయి. యూపీఎస్‌సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ 2020 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. యూపీఎస్‌సీ కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్ 2020 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

UPSC ESE 2020: ఇంజనీరింగ్ సర్వీసెస్‌ 2020 వివరాలివే...


ఇంజనీరింగ్ సర్వీసెస్‌- 495

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 సెప్టెంబర్ 25
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 15 సాయంత్రం 6 గంటలు
యూపీఎస్‌సీ ఈఎస్ఈ ప్రిలిమ్స్- 2020 జనవరి 5


వయస్సు- 21 నుంచి 30 ఏళ్లువిద్యార్హత- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ
పరీక్ష ఫీజు- రూ.200

UPSC ESE 2020: అప్లై చేయండి ఇలా...


ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in ఓపెన్ చేయండి.
'Engineering Services (Preliminary/Stage I) Examination' లింక్ పైన క్లిక్ చేయండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ వివరాలతో రిజిస్టర్ చేసుకోండి.
ముఖ్యమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి దరఖాస్తు సబ్మిట్ చేయండి.
పేమెంట్ చేసిన తర్వాత ఫోటో ఐడీ కార్డ్, ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ కాపీ అప్‌లోడ్ చేయాలి.
చివరగా సబ్మిట్ క్లిక్ చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.
ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.

UPSC CGS 2020: నోటిఫికేషన్ వివరాలివే...


జియో సైంటిస్ట్ మొత్తం ఖాళీలు- 102
జియాలజిస్ట్-79
జియోఫిజిసిస్ట్-05
కెమిస్ట్-15
జూనియర్ హైడ్రాలజిస్ట్-3
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 సెప్టెంబర్ 25
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 15 సాయంత్రం 6 గంటలు
పరీక్ష తేదీ- వెల్లడించాల్సి ఉంది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

LIC Exams: ఎల్ఐసీ జాబ్‌‌కు అప్లై చేశారా? అడ్మిట్ కార్డ్స్ డౌన్‌లోడ్ చేయొచ్చు ఇలా

Railway Jobs: మొత్తం 3,500 పైగా రైల్వే జాబ్స్... ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేశారా?

Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు... 10వ తరగతి పాసైతే చాలు
First published: October 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>