UPSC Civil Services 2019: నేటి నుంచి దరఖాస్తులు... ముఖ్యమైన తేదీలు ఇవే...

UPSC Civil Services 2019 | ప్రిలిమ్స్‌లో సాధించిన మార్కుల్ని ఫైనల్ ర్యాంకింగ్‌లో పరిగణలోకి తీసుకోరు. మెయిన్స్‌లో 1750 మార్కులు, ఇంటర్వ్యూలో 275 మార్కులుంటాయి. మెయిన్, ఇంటర్వ్యూ రౌండ్‌లో మార్కులను బట్టి మెరిట్ స్కోర్ ఇస్తారు.

news18-telugu
Updated: February 19, 2019, 5:54 PM IST
UPSC Civil Services 2019: నేటి నుంచి దరఖాస్తులు... ముఖ్యమైన తేదీలు ఇవే...
UPSC Civil Services 2019: నేటి నుంచి దరఖాస్తులు... ముఖ్యమైన తేదీలు ఇవే...
news18-telugu
Updated: February 19, 2019, 5:54 PM IST
కలెక్టర్ లేదా ఎస్పీ కావడం మీ కలా? ఐఏఎస్, ఐపీఎస్ హోదాలో పనిచేయాలనుకుంటున్నారా? సివిల్స్‌కు సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నారా? యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్-2019 దరఖాస్తు ప్రక్రియ ఇవాళ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 18 వరకు దరఖాస్తు చేయొచ్చు. 2019 జూన్ 2న ప్రిలిమినరీ లెవెల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆశావాహులు ఆన్‌లైన్ పరీక్షకు దరఖాస్తు చేయొచ్చు. యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ అయిన upsc.gov.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేయాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవాళ్లు UPSC CSE 2019 పరీక్షకు దరఖాస్తు చేయొచ్చు.

Read this: Jobs in Amazon: ఆ భాషలు తెలిస్తే అమెజాన్‌లో ఉద్యోగం... రూ.40 వేల జీతం

యూపీఎస్‌సీ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మూడు లెవెల్స్‌లో ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మూడు లెవెల్స్‌లో క్వాలిఫై అయినవారినే ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. జూన్ 2న నిర్వహించే యూపీఎస్‌సీ ప్రిలిమ్స్‌లో పాసైన వారికి సెప్టెంబర్ 20 నుంచి ఐదు రోజుల వరకు మెయిన్స్ పరీక్షలు ఉంటాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(IFS) మెయిన్స్ పరీక్షలు 2019 డిసెంబర్ 1న నిర్వహిస్తారు. IFS పరీక్షలు 10 రోజుల పాటు ఉంటాయి. మెయిన్స్‌లో పాసైనవారికి ఇంటర్వ్యూలు ఉంటాయి.

Read this: Good News: ప్యాకేజీల ధరలు తగ్గిస్తున్న డిష్‌టీవీ, సన్‌డైరెక్ట్, టాటాస్కై



UPSC Civil Services ప్రిలిమ్స్ పరీక్షలో రెండు పేపర్లు(జనరల్ స్టడీస్ పేపర్-1, జనరల్ స్టడీస్ పేపర్-2) ఉంటాయి. ప్రతీ పేపర్‌కు 200 మార్కులు. మల్టిపుల్ ఛాయిస్, ఆబ్జెక్టీవ్ టైప్ ప్రశ్నలుంటాయి. మెయిన్ ఎగ్జామ్‌కు ప్రిలిమ్స్ క్వాలిఫికేషన్ పరీక్ష మాత్రమే. ప్రిలిమ్స్‌లో సాధించిన మార్కుల్ని ఫైనల్ ర్యాంకింగ్‌లో పరిగణలోకి తీసుకోరు. మెయిన్స్‌లో 1750 మార్కులు, ఇంటర్వ్యూలో 275 మార్కులుంటాయి. మెయిన్, ఇంటర్వ్యూ రౌండ్‌లో మార్కులను బట్టి మెరిట్ స్కోర్ ఇస్తారు.

Photos: కాలుష్యం కనిపిస్తే ఇలాగే ఉంటుంది... కళాకారుల ఊహాత్మక చిత్రాలు
Loading...
ఇవి కూడా చదవండి:

Flipkart Mobiles Bonanza: ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు

మీ అమ్మాయి పెళ్లికి రూ.1 కోటి... సేవింగ్స్‌లో ఏ స్కీమ్ బెటర్?

Ban TikTok: టిక్‌ టాక్ యాప్‌ను బ్యాన్ చేయండి... పెరుగుతున్న డిమాండ్లు
First published: February 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...