హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UPSC CSE 2022: యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నారా..? కరెంట్ అఫైర్స్ కోసం ఇలా ప్రిపేర్ అవ్వండి..

UPSC CSE 2022: యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నారా..? కరెంట్ అఫైర్స్ కోసం ఇలా ప్రిపేర్ అవ్వండి..

యూపీఎస్సీ (UPSC) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ (CSE)లో అన్ని సెక్షన్ల కంటే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కాస్త డిఫికల్ట్ గా ఉంటుందని చాలామంది అభ్యర్థులు ఫీలవుతుంటారు. అయితే పక్కా ప్లాన్ ప్రకారం ప్రిపేరైతే జీకే సెక్షన్ (GK Section)లో కూడా మంచి స్కోర్ సాధించవచ్చు.

యూపీఎస్సీ (UPSC) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ (CSE)లో అన్ని సెక్షన్ల కంటే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కాస్త డిఫికల్ట్ గా ఉంటుందని చాలామంది అభ్యర్థులు ఫీలవుతుంటారు. అయితే పక్కా ప్లాన్ ప్రకారం ప్రిపేరైతే జీకే సెక్షన్ (GK Section)లో కూడా మంచి స్కోర్ సాధించవచ్చు.

యూపీఎస్సీ (UPSC) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ (CSE)లో అన్ని సెక్షన్ల కంటే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కాస్త డిఫికల్ట్ గా ఉంటుందని చాలామంది అభ్యర్థులు ఫీలవుతుంటారు. అయితే పక్కా ప్లాన్ ప్రకారం ప్రిపేరైతే జీకే సెక్షన్ (GK Section)లో కూడా మంచి స్కోర్ సాధించవచ్చు.

ఇంకా చదవండి ...

  యూపీఎస్సీ (UPSC) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ (CSE)లో అన్ని సెక్షన్ల కంటే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కాస్త డిఫికల్ట్ గా ఉంటుందని చాలామంది అభ్యర్థులు ఫీలవుతుంటారు. అయితే పక్కా ప్లాన్ ప్రకారం ప్రిపేరైతే జీకే సెక్షన్ (GK Section)లో కూడా మంచి స్కోర్ సాధించవచ్చు. వాస్తవానికి ఈ ఎగ్జామ్ లో డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ (Current Affairs) క్వశ్చన్ల సంఖ్య మారుతూనే ఉంటుంది. కానీ క్వశ్చన్ పేపర్ ను నిశితంగా పరిశీలిస్తే, CSEలో అడిగే ప్రశ్నలలో ఎక్కువ భాగం ఈవెంట్స్(Events), న్యూస్ (News) నుంచి ప్రిపేర్ చేశారని అర్థమవుతుంది. మరి యూపీఎస్సీ అడిగే ఈవెంట్, న్యూస్ సంబంధించిన ప్రశ్నలకు సరైన ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి, వాటిని ఎక్కడి నుంచి సేకరించాలి, హై స్కోర్ సాధించడానికి ఎలా చదవాలి వంటి వివరాలు చూద్దాం.

  ప్రశ్నలను డిఫికల్ట్ గా చేయడానికి... నేషనల్, ఇంటర్నేషనల్ ప్రాముఖ్యత కలిగిన వివిధ సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యల ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ నుంచి UPSC క్వశ్చన్లు ప్రిపేర్ చేస్తుంది. అందువల్ల CSEకి హాజరయ్యే అభ్యర్థులు వార్తల్లోని సమస్యలను విభిన్న కోణంలో చూస్తూ, వాటిపై స్వంత అభిప్రాయాన్ని కలిగి ఉండేలా సిద్ధం కావాలి. అలాగే ఒక టాపిక్ కి సంబంధించి మొత్తం చరిత్ర తెలుసుకోవాలి.

  న్యూస్ పేపర్స్ తప్పక చదవాలి

  సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి న్యూస్ పేపర్స్ చదవడం తప్పనిసరి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మరీ ముఖ్యం. అలాగే, అభ్యర్థులు తాము ఎంచుకున్న రంగాలలో జరుగుతున్న సంఘటనల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై పట్టు సాధించడానికి.. ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన సమయం నుంచే వార్తా పత్రికలు చదవాలి. వార్తాపత్రికలలో రోజువారీ సంపాదకీయాలను అంటే ఎడిటోరియల్స్ చదవడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

  Simplilearn: మహిళల కోసం సింప్లీలెర్న్ స్పెషల్ ప్రోగ్రామ్.. వెయ్యి మంది మహిళలకు శిక్షణ..

  డైలీ ఎడిటోరియల్స్ చదవడం వల్ల వివిధ సమస్యలపై డిఫరెంట్ ఒపీనియన్స్ తెలియడంతో పాటు ఓన్ ఒపీనియన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ అలవాటు వల్ల మెయిన్స్‌లో మెరుగైన, మరింత క్లారిటీ ఆన్సర్స్ రాయడంలో హెల్ప్ అవుతుంది. ఎడిటోరియల్స్ రీడ్ చేయడం వల్ల UPSC ఇంటర్వ్యూలో కూడా హెల్ప్ అవుతుంది.

  కరెంట్ అఫైర్స్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి?

  కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ సమయంలో ఫ్యాక్ట్స్ రీకాల్ చేయాల్సి ఉంటుంది. డేటా పాయింట్లు, కోట్‌లను గుర్తుకు తెచ్చుకోవడం కూడా ముఖ్యమే. అభ్యర్థులు తమ పరిశీలనలు, కంక్లూజన్స్, డేటా పాయింట్లు, స్కీమ్‌ల ముఖ్యాంశాలు, నివేదిక సారాంశాలు డైలీ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చదివే ఇన్ఫర్మేషన్ అంతా మళ్లీ రికాల్ చేసేందుకు వీలుగా నోట్స్ చక్కగా అరేంజ్ చేసుకోవడం ముఖ్యం. అయితే కరెంట్ అఫైర్స్ కు సంబంధించి నోట్స్ పెరుగుతున్న కొద్దీ వీక్లీ, మంత్లీ రివిజన్ చేయాల్సి ఉంటుంది. కీ పాయింట్స్ పదేపదే రివిజన్ చేయడం ద్వారా అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాగే ఇలా రెగ్యులర్ గా ప్రిపేర్ కావడం వల్ల ఎక్కువ స్కోర్ చేసే ఆస్కారం ఉంటుంది.

  ఇంటర్నెట్ ఉపయోగించుకోవడం

  న్యూస్ పేపర్స్ చదివినా.. యూపీఎస్సీ అడిగే ఇంటర్-లింక్డ్ కొన్ని ప్రశ్నలకు అభ్యర్థులు సమాధానాలు చెప్పలేరు. అందుకే వార్తాపత్రికలు చదువుతున్నప్పుడు, అభ్యర్థులు ఆయా అంశాల గురించి ఆలోచించి, సమస్యకు సంబంధించిన చారిత్రక, రాజకీయ, సామాజిక, భౌగోళిక, ఆర్థిక, అంశాలేమిటో తమను తాము ప్రశ్నించుకోవాలి. అలాగే ఆ అంశాల గురించి బేసిక్ రీసెర్చ్ చేయడానికి ఇంటర్నెట్ ఉత్తమ సాధనం. దీంతోపాటు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల నెలవారీ, రోజువారీ కరెంట్ అఫైర్స్‌ను రిఫర్ చేయడం బెటర్. అభ్యర్థులు ప్రతిరోజూ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలను ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి.

  అఫీషియల్ సోర్సెస్ పై డిపెండ్ అవ్వడం

  UPSC CSE అనేది ప్రభుత్వ పరీక్ష, కాబట్టి న్యూస్, ఇన్ఫర్మేషన్ల అఫీషియల్ సోర్సెస్ తరచూ రిఫర్ చేయాలి. అభ్యర్థులు అఫీషియల్ డాక్యుమెంటరీలు, డిబేట్లు, వివిధ సమస్యల లోతైన విశ్లేషణ కోసం పీఐబీ (PIB), ఆల్ ఇండియా రేడియో, Sansad TVని చూడవచ్చు. అలాగే అభ్యర్థులు ప్రభుత్వం ప్రచురించిన పత్రికలు, నివేదికలను చూడాలి. ప్రముఖ మ్యాగజైన్‌లు – యోజన, కురుషేత్ర, ద పెర్స్‌పెక్టివ్ ని ఫాలో అవ్వాలి. నివేదికలలో ఆర్థిక సర్వే, నీతి అయోగ్ మొదలైనవి రెగ్యులర్ గా ఫాలో అయితే సరిపోతుంది

  First published:

  Tags: Civil Services, UPSC

  ఉత్తమ కథలు