UPSC Jobs: మొత్తం 559 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... రైల్వేలోనూ ఖాళీలు

UPSC CMS Exam 2020 Notification | యూపీఎస్‌సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 559 ఖాళీలను ప్రకటించింది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: August 6, 2020, 6:23 PM IST
UPSC Jobs: మొత్తం 559 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... రైల్వేలోనూ ఖాళీలు
UPSC Jobs: మొత్తం 559 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... రైల్వేలోనూ ఖాళీలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విభాగాల్లో వేర్వేరు పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2020 ద్వారా 559 ఖాళీలను భర్తీ చేయనుంది. భారతీయ రైల్వే, సెంట్రల్ హెల్త్ సర్వీస్‌తో పాటు పలు విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 18 చివరి తేదీ. ఎంబీబీఎస్ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://upsc.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

UPSC Jobs: ఇంటర్, డిగ్రీ అర్హతతో 344 ఉద్యోగాలు... హైదరాబాద్‌లోనూ ఖాళీలు

SBI Jobs: ఎస్‌బీఐలో 3850 ఉద్యోగాలు... డిగ్రీ పాసైతే చాలు

UPSC CMS Exam 2020 Notification: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 559
జూనియర్ స్కేల్ పోస్టులు(సెంట్రల్ హెల్త్ సర్వీసెస్)- 182
అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్(రైల్వేస్)- 300అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్(ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ హెల్త్ సర్వీసెస్)- 66
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్(న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్)- 04
జనరల్ డ్యూటీ మెడికల్ గ్రేడ్ 2- 07

IBPS PO: ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది... డిగ్రీ అర్హతతో 1167 పోస్టులు

Jobs: ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతతో 220 ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంపు

UPSC CMS Exam 2020 Notification: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 29
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 18 సాయంత్రం 6 గంటలు
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2020 ఆగస్ట్ 18
రాతపరీక్ష- 2020 అక్టోబర్ 22
విద్యార్హత- ఎంబీబీఎస్ పాస్ కావాలి.
వయస్సు- 2020 ఆగస్ట్ 1 నాటికి 32 ఏళ్లు.
ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ.
దరఖాస్తు ఫీజు- రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
Published by: Santhosh Kumar S
First published: August 6, 2020, 6:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading