UPSC CMS 2021: యూపీఎస్సీ నుంచి ఆ నోటిఫికేషన్ విడుదల.. ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2021కు సంబంధించిన నోటిఫికేషన్ ను యూపీఎస్సీ ఈ రోజు విడుదల చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2021 కు సంబంధించిన నోటిఫికేషన్ ను ఈ రోజు విడుదల చేసింది. దీంతో ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ రోజు నుంచి జులై 27 వరకు కొనసాగనుంది. ఎంబీబీఎస్ పాసైన అభ్యర్థులు ఈ ఎగ్జామ్ కు అప్లై చేయొచ్చు. ఈ ఏడాది ఫైనలియర్ పరీక్షలు రాయాల్సి ఉన్న అభ్యర్థులు సైతం అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో తెలిపారు. అభ్యర్థుల వయో పరిమితిని 32 ఏళ్లుగా నిర్ణయించారు. వాస్తవానికి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2021 యొక్క నోటిఫికేషన్ మే 5 న విడుదల చేయాల్సి ఉంది. పరీక్ష సైతం ఆగస్టు 29 న జరగాల్సి ఉంది. కానీ కరోనా కారనంగా, నోటిఫికేషన్ మరియు పరీక్షను ఆ సమయంలో అధికారులు వాయిదా వేశారు. కరోనా ప్రభావం తగ్గడంతో మళ్లీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ సంస్థల్లో మెడికల్ ఆఫీసర్ల నియామకానికి యూపీఎస్సీ ఈ పరీక్షను నిర్వహిస్తోంది.
    Central Government Jobs: నిరుద్యోగులకు గమనిక.. కేంద్ర కొలువులకు ఒక్కటే పరీక్ష.. ఎప్పటినుంచంటే..

    అప్లికేషన్ కు ఈ కింది స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది..
    -అభ్యర్థులు ముందుగా యూపీఎస్స అధికారిక వెబ్ సైట్ upsc.gov.inను ఓపెన్ చేయాలి.
    -వెబ్ సైట్ లో What’s New కేటగిరీలో UPSC CMS 2021 నోటిఫికేషన్ లింక్ కనిపిస్తుంది. అభ్యర్థులు ఆ లింక్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
    -క్లిక్ చేసిన అనంతరం న్యూ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ Click Here ఆప్షన్ కనిపిస్తుంది.
    -ఆ ఆప్షన్ పై క్లిక్ చేసి సూచించిన వివరాలను నమోదు చేసి దరఖాస్తును పూర్తి చేయొచ్చు.
    -దరఖాస్తులో వివరాలు నమోదు చేసిన అనంతరం సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
    -అనంతరం అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవాలి.
    -అప్లై చేసే సమయంలో అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

    ఇదిలా ఉంటే.. ఈ పరీక్షను నవంబర్ 21న నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక రెండు టెస్ట్ ల ద్వారా నిర్వహించనున్నారు. UPSC CMS 2021 Part 1 ఎగ్జామ్ రెండు పేపర్లుగా ఉంటుంది. ప్రతీ పేపర్ కు 250 మార్కులతో పాటు రెండు గంటల సమయం ఉంటుంది.
    -పార్ట్ 1 పరీక్షలో క్వాలిఫై అయిన వారు UPSC CMS 2021 Part II examకు అర్హులు. ఈ పరీక్ష 100 మార్కులకు నిర్వహించనున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published: