UPSC Civils Results: సివిల్స్ ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ... టాపర్‌గా నిలిచిన కనిషక్ కటారియా...

ఐఐటీ ముంబైకి చెందిన కనిషక్ కటారియా సివిల్స్ 2018 టాపర్‌... ఏడో ర్యాంకు సాధించిన తెలుగు విద్యార్థి వరుణ్ రెడ్డి...

Chinthakindhi.Ramu
Updated: April 5, 2019, 9:20 PM IST
UPSC Civils Results: సివిల్స్ ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ... టాపర్‌గా నిలిచిన కనిషక్ కటారియా...
UPSC Civils Results: సివిల్స్ ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ... టాపర్‌గా నిలిచిన కనిషక్ కటారియా...
Chinthakindhi.Ramu
Updated: April 5, 2019, 9:20 PM IST
UPSC Civils Results: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018లో నిర్వహించిన సివిల్ సర్వీస్ పరీక్ష 2018 ఫలితాలను విడుదల చేసింది. యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో https://upsc.gov.in/ ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఎంపికైన అభ్యర్థుల వివరాల జాబితాను PDF ఫైల్‌లో అందుబాటులో ఉంచింది. ఎప్పటిలాగే అభ్యర్థుల పేరు, హాల్ టికెట్ నెంబర్‌తో సహా ఫలితాలను జాబితాలో పొందుపర్చింది యూపీఎస్సీ. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 812 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షకు గాను 759 మంది అభ్యర్థలను ఎంపిక చేసింది. వీరిలో జనరల్ కేటగిరి అభ్యర్థులు 361 మంది కాగా, OBC కేటగిరిలో 209 మంది, SC కేటగిరిలో 128 మంది, ST కేటగిరిలో 61 మంది ఎంపికయ్యారు.

ఐఐటీ ముంబైకి చెందిన కనిషక్ కటారియా సివిల్స్ 2018 టాపర్‌గా నిలిచాడు. ఆ అక్షత్ జైన్ రెండో ర్యాంకు సాధించగా... జునైద్ అహ్మద్ మూడో ర్యాంకు, శ్రేయాన్స్ కుమత్ నాలుగో ర్యాంకులో నిలిచాడు. శ్రుతి జయంత్ దేశ్‌ముఖ్ టాప్ 5లో నిలిచి, అమ్మాయిల్లో టాపర్‌గా నిలిచింది. తెలుగువారిలో వరుణ్ రెడ్డి 7వ ర్యాంకు సాధించగా, అంకితా చౌదరి 14వ ర్యాంకు సాధించాడు. 2018 సెప్టెంబరులో సివిల్స్ పరీక్షలు నిర్వహించగా, ఫిబ్రవరి- మార్చి నెలలో ఇంటర్వ్యూలు జరిగాయి. తాజాగా ఏప్రిల్ 5న ఫలితాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చింది యూపీఎస్సీ. ఎంపికైన అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా IAS, IFS, IPS, సెంట్రల్ సర్వీస్‌లు, Group A, Group B సర్వీసుల్లో పోస్టింగులు ఉంటాయి.

యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి: https://upsc.gov.in/

First published: April 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...