Home /News /jobs /

UPSC CIVIL SERVICES RESULT UPSC CIVIL SERVICES RESULTS RELEASED KNOW SELECTED TELUGU STUDENTS EVK

UPSC Civil Services result: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల..సెల‌క్ట్ అయిన‌ తెలుగు విద్యార్థులు వీరే!

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

UPSC Results | ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS), ఐఎఫ్‌ఎస్‌ (IFS)తదితర కేంద్ర అత్యున్నత సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (Union Public Service Commission) నిర్వహించిన సివిల్స్‌ పరీక్షల ప్రిలిమ్స్ (Civil Services prelims)‌–2021 ఫలితాలు విడుదల అయ్యాయి.

ఇంకా చదవండి ...
    ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS), ఐఎఫ్‌ఎస్‌ (IFS)తదితర కేంద్ర అత్యున్నత సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (Union Public Service Commission) నిర్వహించిన సివిల్స్‌ పరీక్షల ప్రిలిమ్స్ (Civil Services prelims)‌–2021 ఫలితాలు విడుదల అయ్యాయి.  సోమవారం సివిల్స్ 2021 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  విడుదల చేసింది.  ఈ పరీక్షలో 685 మందిని యూపీఎస్‌సీ ఎంపిక చేసింది.  సివిల్స్‌లో శృతి శర్మ మొదటి ర్యాంక్, అంకిత అగర్వాల్.. రెండో ర్యాంక్, గామిని సింగ్మా.. మూడో ర్యాంక్ సాధించారు.

    సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

    సివిల్స్ -2021లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు మంచి ఫలితాలను సాధించారు. ఈ సారి ఫలితాల్లో యశ్వంత్ కుమార్ రెడ్డి 15 వ ర్యాంకు సాధించారు. పూసపాటి సాహిత్య 24, కొప్పి శెట్టి కిరణ్మ యి 56, శ్రీపూజ 62, గడ్డం సుధీర్ కుమార్రెడ్డి 69, ఆకునూరి నరేశ్ 117, అరుగుల స్నేహ 136, బి.చైతన్య రెడ్డి 161, ఎస్.కమలేశ్వ రరావు 297, విద్యా మరి శ్రీధర్ 336, దిబ్బడ ఎస్వీ అశోక్ 350, గుగులావత్ శరత్ నాయక్ 374, నల్లమోతు బాలకృష్ణ 420, ఉప్పు లూరి చైతన్య 470, మన్యా ల అనిరుధ్ 564, బిడ్డి అఖిల్ 566, రంజిత్ కుమార్ 574, పాండు విల్స న్ 602, బాణావత్ అరవింద్ 623, బచ్చు స్మరణ్రాజ్ 676 ర్యాం కులు సాధించారు.

    ఫ‌లితాలు చూసుకోడిలా..

    స్టెప్ 1: అధికారిక వెబ్ సైట్ https://www.upsc.gov.in/exams-related-info/final-result  లోకి వెళ్లాలి.

    స్టెప్ 2: అక్కడ Civil Services (Main) Examination, 2021 లింక్ కనపడుతుంది.

    స్టెప్ 3: రిజల్ట్ పై క్లిక్ చేయగానే పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.. అక్కడ మీ నెంబర్ చెక్ చేసుకోండి.

    ఇక, యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్-2021 ప్రిలిమినరీ పరీక్ష గతేడాది అక్టోబర్ 21న నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు అక్టోబర్ 29న విడుదలయ్యాయి. ఈ ఏడాది జనవరి 7 నుంచి 16 వరకు main examination నిర్వహించారు. ఈ ఫలితాలు మార్చి 17న ప్రకటించారు. అందులో అర్హత సాధించిన వారికి ఏప్రిల్ 5 నుంచి మే 26 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. చివరిగా నేడు తుది ఫలితాలను విడుదల చేశారు.  (ఫలితాల కోసం క్లిక్ చేయండి) 

    పరీక్ష వివరాలు..
    - యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్-2021 ప్రిలిమినరీ పరీక్ష గతేడాది అక్టోబర్ 21న నిర్వహించారు.
    - ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు అక్టోబర్ 29న విడుదలయ్యాయి.
    - 2022 జనవరి 7 నుంచి 16 వరకు మెయిన్స్‌ నిర్వహించారు.
    - ఈ ఫలితాలు మార్చి 17న ప్రకటించారు.
    - అందులో అర్హత సాధించిన వారికి ఏప్రిల్ 5 నుంచి మే 26 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.
    - నేడు తుది ఫలితాలను విడుదల చేశారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Civil Services, Civils, Exam results, UPSC

    తదుపరి వార్తలు