Home /News /jobs /

UPSC CIVIL SERVICES 2022 HERE IS A SHORT COMPLIATION QUESTIONS ASKED IN PREVIOUS PRELIMINARY EXAM CAN YOU ANSWER THESE GH SRD

UPSC Civil Services: సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నారా? మీరు గతంలో అడిగిన ట్రిక్కీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

UPSC Civil Services: ఐఏఎస్ (IAS), ఐపీఎస్(IPS) లాంటి ఉద్యోగాలు సాధించాలనే డ్రీమ్ చాలా మంది నిరుద్యోగులకు ఉంటుంది. కానీ ఇది నిజం చేసుకోవడం కొంతమందికే సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఈ ఎగ్జామ్‌కు కేవలం ప్రిపరేషన్ మాత్రమే సరిపోదు. ముఖ్యంగా ప్రిలిమ్స్‌లో అడిగే ట్రిక్కీ క్వశ్చన్లు సాల్వ్ చేయాలంటే లాజికల్ గా థింక్ చేసే బ్రెయిన్ కావాలి.

ఇంకా చదవండి ...
ఇండియాలో టఫెస్ట్ (Toughest) ఎగ్జామ్స్‌లో యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్ ఎగ్జామ్ (UPSC Civil Services EXAM) టాప్ ప్లేస్‌లో ఉంటుంది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ (IAS), ఐపీఎస్(IPS) లాంటి ఉద్యోగాలు సాధించాలనే డ్రీమ్ చాలా మంది నిరుద్యోగులకు ఉంటుంది. కానీ ఇది నిజం చేసుకోవడం కొంతమందికే సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఈ ఎగ్జామ్‌కు కేవలం ప్రిపరేషన్ మాత్రమే సరిపోదు. ముఖ్యంగా ప్రిలిమ్స్‌లో అడిగే ట్రిక్కీ క్వశ్చన్లు సాల్వ్ చేయాలంటే లాజికల్ గా థింక్ చేసే బ్రెయిన్ కావాలి. ఈ ఎగ్జామ్‌లో అడిగే క్వశ్చన్లు ఎంత ట్రిక్కీగా ఉంటాయో తెలుసుకోవాలని ప్రతి యూపీఎస్సీ అభ్యర్థికి ఉంటుంది. వీటిని తెలుసుకుంటే అభ్యర్థులకు హెల్ప్ కూడా అవుతుంది. ఈ ఏడాది జూన్ 5న ప్రిలిమ్స్ 2022 ఎగ్జామ్ జరగనుంది. ఈ నేపథ్యంలో గత యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్ ఎగ్జామ్‌లోని జనరల్ స్టడీస్ I, జనరల్ స్టడీస్ IIలో అడిగిన ట్రిక్కీ ప్రశ్నలు ఏవో ఇప్పుడు చూద్దాం.

క్వశ్చన్ 1) ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ అనే నాలుగు పరీక్షలు వరుసగా నాలుగు రోజుల్లో నిర్వహించాలి.. ఒకే క్రమంలో అవసరం లేదు. బయాలజీ తర్వాత కండక్ట్ చేసే పరీక్షకు ముందు ఫిజిక్స్ పరీక్ష నిర్వహిస్తారు. సరిగ్గా రెండు పరీక్షలు జరిగిన తర్వాత కెమిస్ట్రీ నిర్వహిస్తారు. ఏ ఎగ్జామ్‌ని లాస్ట్‌లో కండక్ట్ చేస్తారు?

ఏ) ఫిజిక్స్
బీ) బయాలజీ
సీ) మ్యాథమెటిక్స్
డీ) కెమిస్ట్రీ

క్వశ్చన్ 2) పర్యావరణ కోణంలో (Ecological Point Of View), తూర్పు కనుమలు (Eastern Ghats)... పశ్చిమ కనుమల (Western Ghats) మధ్య మంచి లింక్‌గా ఉంటూ కింది వాటిలో ఒకటి ప్రాముఖ్యతను సంతరించుకుంది. అది ఏంటి?

ఏ) సత్యమంగళం టైగర్ రిజర్వ్స్
బీ) నల్లమల ఫారెస్ట్
సీ) నాగర్‌హోల్ నేషనల్ పార్క్
డీ) శేషాచలం బయోష్‌పెహెర్ రిజర్వ్

క్వశ్చన్ 3) రెండవ, నాల్గవ శనివారాలతో సహా అన్ని ఆదివారాల్లో ఆఫీస్‌కి హాలిడేస్ అనుకుంటే.. ఒక ఏడాదిలోని ఏదైనా ఒక నెలలో సాధ్యమయ్యే కనీస పని దినాల (Minimum Number Of Possible Working Days) సంఖ్య ఎంత?
ఏ) 23
బీ) 22
సీ) 21
డీ) 20

క్వశ్చన్ 4) సమాజంలో సమానత్వాన్ని కొనసాగించాలంటే వీటిలో ఉండకూడనిది ఏంటి (One of the implications of equality in society is the absence of)
ఏ) అధికారాలు (Privileges)
బీ) పరిమితులు (Restraints)
సీ) పోటీ
డీ) భావజాలం (Ideology)

క్వశ్చన్ 5) 52 మంది విద్యార్థులు గల ఒక క్లాసులో 15 మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. ఫెయిల్‌ అయిన విద్యార్థుల పేర్లను తొలగించి మెరిట్‌ ఆర్డర్‌ లిస్ట్‌ను తయారు చేయగా... అందులో టాప్‌ నుంచి రమేష్‌ 22వ స్థానంలో నిలిచారు. బాటమ్ నుంచి అతని స్థానం ఏంటి?
ఎ) 18
బి) 17
సి) 16
డి) 15

క్వశ్చన్ 6) కింది వాటిలో ఏది ప్రపంచ దేశాలకు 'గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్' ర్యాంకింగ్ ఇస్తుంది?

ఏ) వరల్డ్ ఎకనామిక్స్ ఫోరమ్
బీ) యూఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్
సీ) యూఎన్ ఉమెన్
డీ) వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్

క్వశ్చన్ 7) 2-అంకెల సంఖ్యను రివర్స్ చేసి.. ఆ రెండు సంఖ్యలలోని పెద్ద సంఖ్యను చిన్నదానితో భాగిస్తే... వచ్చే అతిపెద్ద శేషం (Largest Possible Remainder) ఏది?

ఏ) 9
బీ) 27
సీ) 36
డీ) 45

క్వశ్చన్ 8) ఇండియాలోని ఒక ప్రదేశంలో సముద్ర తీరంలో మీరు నిలబడి సముద్రాన్ని వీక్షిస్తే, సముద్రపు నీరు తీర రేఖ (Shore Line) నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో తగ్గి, రోజుకు రెండుసార్లు ఒడ్డుకు తిరిగి వస్తుందని మీరు గమనిస్తారు. నీరు తగ్గినప్పుడు మీరు ఈ ప్రాంతంలో నడవచ్చు కూడా. ఈ ప్రత్యేకమైన దృశ్యం ఎక్కడ కనిపిస్తుంది?

ఏ) భావ్‌నగర్

బీ) భీమునిపట్నం

సీ) చాందీపూర్

డీ) నాగపట్నం

ఈ పరీక్షకు అర్హత సాధించడానికి, అభ్యర్థులు జనరల్ స్టడీస్ పేపర్-IIలో కనీసం 33 శాతం పొందాలి. పేపర్ II పాస్ అయిన అభ్యర్థులను మాత్రమే కటాఫ్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ప్రిలిమ్స్‌లో రెండు 200 మార్కుల పేపర్లు ఉంటాయి. తప్పనిసరిగా రాయాల్సిన ఈ రెండు క్వశ్చన్ పేపర్లలో ఆబ్జెక్టివ్‌ టైప్ ప్రశ్నలుంటాయి.
Published by:Sridhar Reddy
First published:

Tags: Central Government Jobs, Civil Services, Exam Tips, UPSC

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు