సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) బుధవారం నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) బుధవారం నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) బుధవారం నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు (Applications) ఆహ్వానిస్తోంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియను (Application Process) ప్రారంభించగా.. డిసెంబర్ 21లోపు సీఐఎస్ఎఫ్ అధికారిక వెబ్సైట్ www.upsc.gov.inలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులను కేవలం సీఐఎస్ఎఫ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులకే కేటాయించారు. నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదు. దరఖాస్తు ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, వయోపరిమితి వంటి వివరాలను చూద్దాం.
ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి? Step 1:యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.inని సందర్శించండి. Step 2:హోమ్ పేజీలో ‘CISF AC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2021’ లింక్‌పై క్లిక్ చేయండి. Step 3:వెంటనే మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. పోర్టల్‌లో కావాల్సిన వివరాలు, డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. Step 4: వెంటనే దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. ఆ తర్వాత ఫీజు చెల్లించండి. Step 5:భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసి ప్రింటవుట్ తీసుకోండి. BSF Jobs: పదోతరగతి అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. అప్లికేషన్ ప్రాసెస్, వేతనం వివరాలు
కాగా, విజయవంతంగా దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ లేదా హార్డ్ కాపీని సీఐఎస్ఎఫ్ అధికారులకు పంపాలి. డైరెక్టర్ జనరల్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 13, సీజీఓ కాంప్లెక్స్, లోడి రోడ్, న్యూఢిల్లీ 110003 అడ్రస్‌కు పోస్ట్ చేయాలి.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అనేది భారతదేశంలోని కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో ఒకటి. ప్రస్తుతం ఈ విభాగంలో 148,371 మంది సిబ్బంది క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. సున్నితమైన ప్రభుత్వ భవనాలకు సెక్యూరిటీ, ఢిల్లీ మెట్రో, విమానాశ్రయ భద్రత.. వంటి విధుల్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొంటారు. కేంద్ర హోం శాఖ పరిధిలోని ఈ విభాగంలో పనిచేయడానికి దేశవ్యాప్తంగా ఎంతోమంది ఆసక్తి చూపుతారు. ఇలాంటి వారు తాజా రిక్రూట్మెంట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.