UPSC CDS 2021: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్‌లో జాబ్స్... 339 ఖాళీలు

UPSC CDS 2021: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్‌లో జాబ్స్... 339 ఖాళీలు (ప్రతీకాత్మక చిత్రం)

UPSC CDS 2021 | మిలిటరీ, నేవీ, ఎయిర్‌ఫోర్సులో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. యూపీఎస్‌సీ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ నోటిఫికేషన్ వచ్చింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్-CDS రెండో నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతీ ఏటా ఈ నోటిఫికేషన్‌ను రెండుసార్లు రిలీజ్ చేస్తుంది యూపీఎస్‌సీ. ఇప్పుడు రెండో నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తుల్నిస్వీకరిస్తోంది. ఈసారి 339 ఖాళీలను ప్రకటించింది. డిఫెన్స్‌లోని ఎయిర్‌ఫోర్స్, నేవీ, మిలిటరీ ఫోర్స్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కూడా పలు పోస్టులున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు https://upsc.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేయడానికి 2021 ఆగస్ట్ 24 చివరి తేదీ. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

    UPSC CDS II 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 339
    ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రడూన్- 100
    ఇండియన్ నావల్ అకాడమీ, ఎజిమల- 22
    ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్- 32
    ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (పురుషులు)- 169
    ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మహిళలు)- 16

    UPSC Recruitment 2021: జర్నలిజంలో అనుభవం ఉందా? రూ.1,42,000 వేతనంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

    SBI Jobs 2021: ఎస్‌బీఐలో 6100 జాబ్స్... సెలెక్షన్ ప్రాసెస్ ఇదే

    UPSC CDS II 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


    నోటిఫికేషన్ విడుదల- 2021 ఆగస్ట్ 4
    దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 4
    ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 24 సాయంత్రం 6 గంటలు
    దరఖాస్తుల విత్‌డ్రా- 2021 ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 6 సాయంత్రం 6 గంటలు
    అడ్మిట్ కార్డుల విడుదల- ఎగ్జామ్‌కు మూడు వారాల ముందు

    UPSC CDS II 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    విద్యార్హత- ఐఎంఏ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ-చెన్నై కోసం డిగ్రీ పాస్ కావాలి. ఇండియన్ నావల్ అకాడమీ కోసం ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. ఎయిర్ ఫోర్స్ అకాడమీ కోసం 10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్‌తో పాటు డిగ్రీ పాస్ కావాలి. లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
    దరఖాస్తు ఫీజు- రూ.200. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
    పరీక్షా కేంద్రాలు- హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ
    వయస్సు- 20 నుంచి 24 ఏళ్లు. 1998 జూలై 2 నుంచి 2003 జూలై 1 మధ్య జన్మించిన వారు అప్లై చేయాలి.

    RRB Group D Jobs: త్వరలో 1,03,769 రైల్వే జాబ్స్‌కు ఎగ్జామ్... ఏం చదవాలంటే

    Post Office Jobs: టెన్త్ అర్హతతో పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

    UPSC CDS II 2021: అప్లై చేయండి ఇలా


    అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    హోమ్ పేజీలో ONLINE APPLICATION FOR VARIOUS EXAMINATIONS OF UPSC లింక్ క్లిక్ చేయాలి.
    తర్వాతి పేజీలో Combined Defence Services Examination (II) నోటిఫికేషన్ ఉంటుంది.
    Part-I Registration రిజిస్ట్రేషన్ లింక్ పైన క్లిక్ చేయాలి.
    అభ్యర్థి వివరాలతో పార్ట్ 1 రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
    ఆ తర్వాత పార్ట్ 2 రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
    ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించాలి.
    దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: