Home /News /jobs /

UPSC CDS 2022 II UNION PUBLIC SERVICE COMMISSION RELEASED COMBINED DEFENCE SERVICES EXAMINATION NOTIFICATION WITH 339 VACANCIES SS

UPSC CDS 2022: యూపీఎస్‌సీ జాబ్ నోటిఫికేషన్... డిగ్రీ అర్హతతో 339 పోస్టులు

UPSC CDS 2022: యూపీఎస్‌సీ జాబ్ నోటిఫికేషన్... డిగ్రీ అర్హతతో 339 పోస్టులు
(ప్రతీకాత్మక చిత్రం)

UPSC CDS 2022: యూపీఎస్‌సీ జాబ్ నోటిఫికేషన్... డిగ్రీ అర్హతతో 339 పోస్టులు (ప్రతీకాత్మక చిత్రం)

UPSC CDS 2022 | యూపీఎస్‌సీ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS) నోటిఫికేషన్ ద్వారా 339 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఎంపికైనవారికి ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పోస్టింగ్ లభిస్తుంది.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS) ఎగ్జామినేషన్ కోసం జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. మొత్తం 339 పోస్టుల్ని ప్రకటించింది. హైదరాబాద్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పలు ఖాళీలున్నాయి. ఈ ఎగ్జామినేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు 2022 జూన్ 7 లోగా దరఖాస్తు చేయాలి. డిగ్రీ పాసైనవారు అప్లై చేయొచ్చు. 2022 సెప్టెంబర్ 4న ఎగ్జామ్ ఉంటుంది. ఎంపికైనవారికి ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో అడ్మిషన్ లభిస్తుంది. శిక్షణ తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

UPSC CDS 2022: ఖాళీల వివరాలివే





























మొత్తం ఖాళీలు339
ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రడూన్100
ఇండియన్ నావల్ అకాడమీ, ఎజిమల22
ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్32
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (పురుషులు)169
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మహిళలు)16

Railway Jobs: నిరుద్యోగులకు అలర్ట్... 72,000 పోస్టుల్ని తొలగించిన భారతీయ రైల్వే

UPSC CDS 2022: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


నోటిఫికేషన్ విడుదల- 2022 మే 18

దరఖాస్తు ప్రారంభం- 2022 మే 18

దరఖాస్తుకు చివరి తేదీ- 2022 జూన్ 7 సాయంత్రం 6 గంటల వరకు

దరఖాస్తుల ఉపసంహరణ- 2022 జూన్ 14 నుంచి 2022 జూన్ 20 సాయంత్రం 6 గంటల వరకు

పరీక్ష తేదీ- 2022 సెప్టెంబర్ 4

కోర్సు ప్రారంభం- 2023 జూలై

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

UPSC NDA NA 2022: యూపీఎస్‌సీ నుంచి ఎన్‌డీఏ జాబ్ నోటిఫికేషన్... ఇంటర్ అర్హతతో 400 పోస్టులు


UPSC CDS 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


విద్యార్హతలు- ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో అడ్మిషన్ల కోసం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. ఇండియన్ నావల్ అకాడమీలో అడ్మి,న్ల కోసం ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ కావాలి. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో అడ్మిషన్ల కోసం బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా డిగ్రీ పాస్ కావాలి. (ఇంటర్మీడియట్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్ తప్పనిసరి)

ఇతర అర్హతలు- పెళ్లి కాని పురుషులు, మహిళలు మాత్రమే అప్లై చేయాలి.

వయస్సు- ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీ కోసం అప్లై చేసే అభ్యర్థులు 1999 జూలై 2 నుంచి 2004 జూలై 1 మధ్య జన్మించినవారై ఉండాలి. ఎయిర్ ఫోర్స్ అకాడమీ కోసం అప్లై చేసే అభ్యర్థులు 1999 జూలై 2 నుంచి 2003 జూలై 1 మధ్య జన్మించినవారై ఉండాలి.

దరఖాస్తు ఫీజు- రూ.200. ఎస్‌సీ, ఎస్‌టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం- రాతపరీక్ష, ఇంటర్వ్యూ

పరీక్షా కేంద్రాలు- తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Central Government Jobs, Indian Air Force, Indian Army, Indian Navy, JOBS, UPSC

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు