Home /News /jobs /

UPSC CDS 1 2022 UNION PUBLIC SERVICE COMMISSION INVITES APPLICATIONS FOR COMBINED DEFENCE SERVICES EXAMINATION 2022 WITH 341 VACANCIES KNOW HOW TO APPLY SS

UPSC CDS 2022: నిరుద్యోగులకు అలర్ట్... 341 పోస్టులతో యూపీఎస్‌సీ నోటిఫికేషన్

UPSC CDS 2022: నిరుద్యోగులకు అలర్ట్... 341 పోస్టులతో యూపీఎస్‌సీ నోటిఫికేషన్
(ప్రతీకాత్మక చిత్రం)

UPSC CDS 2022: నిరుద్యోగులకు అలర్ట్... 341 పోస్టులతో యూపీఎస్‌సీ నోటిఫికేషన్ (ప్రతీకాత్మక చిత్రం)

UPSC CDS Examination 2022 | కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS) ఎగ్జామినేషన్ 1-2022 కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది యూపీఎస్‌సీ. ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

    యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS) ఎగ్జామినేషన్ 1-2022 నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) ద్వారా ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది యూపీఎస్‌సీ. మొత్తం 341 ఖాళీలు ఉన్నాయి. ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2022 జనవరి 11 చివరి తేదీ. 2022 ఏప్రిల్ 10న యూపీఎస్‌సీ సీడీఎస్ 1 ఎగ్జామ్ ఉంటుంది.

    UPSC CDS Examination 2022: ఖాళీల వివరాలు ఇవే...





























    మొత్తం ఖాళీలు341
    ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రడూన్100
    ఇండియన్ నావల్ అకాడమీ, ఎఝిమల22
    ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్32
    ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మెన్)170
    ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (వుమెన్)17



    APPSC Recruitment 2021: ఏపీలో ఉద్యోగాలు... రూ.93,780 వరకు వేతనం... రేపే చివరి తేదీ

    UPSC CDS Examination 2022: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 డిసెంబర్ 22

    దరఖాస్తుకు చివరి తేదీ- 2022 జనవరి 11 సాయంత్రం 6 గంటల వరకు

    దరఖాస్తుల ఉపసంహరణ- 2022 జనవరి 18 నుంచి జనవరి 24 సాయంత్రం 6 గంటల వరకు

    యూపీఎస్‌సీ సీడీఎస్ 1 ఎగ్జామ్- 2022 ఏప్రిల్ 10

    కోర్సు ప్రారంభం- 2023 జనవరి

    UPSC CDS Examination 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. ఎయిర్ ఫోర్స్ అకాడమీకి అప్లై చేసే అభ్యర్థులు 10+2 లో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఉండాలి. లేదా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పాస్ కావాలి.

    దరఖాస్తు ఫీజు- రూ.200. ఎస్‌సీ, ఎస్‌టీ, మహిళా అభ్యర్థులకు పీజు లేదు.

    వయస్సు- మిలిటరీ అకాడమీ, నావల్ అకాడమీకి అప్లై చేసేవారు 1999 జనవరి 2 నుంచి 2004 జనవరి 1 మధ్య జన్మించినవారై ఉండాలి. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి దరఖాస్తు చేసే అభ్యర్థులు 1998 జనవరి 2 నుంచి 2004 జనవరి 1 మధ్య జన్మించినవారై ఉండాలి. ఎయిర్ ఫోర్స్ అకాడమీకి అప్లై చేసేవారికి 2023 జనవరి 1 నాటికి 20 నుంచి 24 ఏళ్లు ఉండాలి.

    ఎంపిక విధానం- రాతపరీక్ష, ఇంటర్వ్యూ.

    ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Central Bank Jobs 2021: సెంట్రల్ బ్యాంకులో 214 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

    UPSC CDS Examination 2022: దరఖాస్తు విధానం


    Step 1- అభ్యర్థులు యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://upsconline.nic.in/ ఓపెన్ చేయాలి.

    Step 2- హోమ్ పేజీలో ONLINE APPLICATION FOR VARIOUS EXAMINATIONS OF UPSC లింక్ క్లిక్ చేయాలి.

    Step 3- లిస్ట్‌లో Combined Defence Services Examination (I) నోటిఫికేషన్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్స్ ఉంటాయి.

    Step 4- మొదట Click Here for PART I పైన క్లిక్ చేయాలి.

    Step 5- పార్ట్ 1 రిజిస్ట్రేషన్‌లో అభ్యర్థి వివరాలు ఎంటర్ చేయాలి.

    Step 6- ఆ తర్వాత పార్ట్ 2 రిజిస్ట్రేషన్ కోసం Click Here for Part II పైన క్లిక్ చేయాలి.

    Step 7- ఫీజ్ పేమెంట్ చేసి, ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
    అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Central Government Jobs, Govt Jobs 2021, Job notification, JOBS, UPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు