UPSC CDS 2022 | డిగ్రీ, బీటెక్, బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ పాస్ అయినవారికి అలర్ట్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS) 1 నోటిఫికేషన్ విడుదలైంది.
త్రివిధ దళాల్లో అత్యున్నత పోస్టుల భర్తీకి నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS) 1 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) ద్వారా మొత్తం 341 పోస్టులను భర్తీ చేయనుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఈ పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహిస్తుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు www.upsc.gov.in వెబ్సైట్ ద్వారా జనవరి 11లోపు దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులను కోరింది. ఏప్రిల్10న పరీక్ష నిర్వహిస్తారు. కాగా, ఈ పరీక్ష ద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ప్రవేశాలు కల్పిస్తారు. అనంతరం ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత లెఫ్టిలెఫ్టినెంట్ హోదాలో ఆఫీసర్ స్థాయి ఉద్యోగంలోకి తీసుకుంటారు.
UPSC CDS 2022: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు
341
ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రడూన్
100
ఇండియన్ నావల్ అకాడమీ, ఎఝిమల
22
ఎయిర్ ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్
32
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మద్రాస్) 117వ ఎస్ఎస్సీ మెన్ (NT)
170
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మద్రాస్) 31వ ఎస్ఎస్సీ వుమెన్ (NT)
ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 20 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1999 జనవరి 2 నుంచి 2004 జనవరి 1మధ్య జన్మించి ఉండాలి. ఇక, ఎయిర్ ఫోర్స్ అకాడమీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 20 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా డీగ్రీ లేదా బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తుదారులు అప్లికేషన్ ఫీజుగా రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ?
ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశల్లో ఉంటుంది. ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో ప్రతి విభాగానికి 100 మార్కుల చొప్పున మొత్తం మూడు విభాగాలకు 300 మార్కులు కేటాయించారు. ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, బేసిక్ మ్యాథ్స్ విభాగాల నుంచి ప్రశ్నలొస్తాయి. అన్ని విభాగాల నుంచి ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు సమాధానానికి నాలుగు ఆప్షన్లు ఉంటాయి. తప్పుగా సమాధానం గుర్తించిన ప్రతి ప్రశ్నకు మూడింట ఒక వంతు 1/3 మార్కుల కోత విధిస్తారు. ఈ పరీక్షలో మినిమం కటాఫ్ మార్కులు సాధించిన వారికి ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. వాటిలో షార్ట్‌లిస్ట్ అయితే మెడికల్ టెస్ట్ నిర్వహించి తుది జాబితా సిద్ధం చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులను లెఫ్టినెంట్ హోదా పోస్ట్‌లో నియమిస్తారు. వీరికి రూ. 56,100 నుంచి రూ. 1,77,500 పరిధిలో నెలవారీ జీతం లభిస్తుంది. అదనంగా అలవెన్సులు కూడా ఉంటాయి. ఇక శిక్షణ వ్యవధిలో ప్రతి నెలా రూ. 56,100 స్టైపెండ్ అందజేస్తారు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.