కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్-CAPF నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 209 ఖాళీలను ప్రకటించింది. ఎంపికైనవారిని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP), సీమా సశస్త్ర బల్ (SSB) బలగాల్లో నియమించనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్ట్ 18న ప్రారంభమైంది. అప్లై చేయడానికి సెప్టెంబర్ 7 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను /యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://www.upsc.gov.in/ లో తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్లో విద్యార్హతల వివరాలు తెలుసుకున్న తర్వాత ఆసక్తి గల అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్సైట్లో అప్లై చేయాలి.
UPSC CAPF Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే
మొత్తం ఖాళీలు- 209
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)- 78
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)- 13
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)- 69
ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP)- 27
సీమా సశస్త్ర బల్ (SSB)- 22
Railway Jobs: రైల్వేలో 4499 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే
DRDO Jobs: గుడ్ న్యూస్... డీఆర్డీఓలో 311 ఉద్యోగాలకు గడువు పెంపు

ప్రతీకాత్మక చిత్రం
UPSC CAPF Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 18
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 7
పరీక్ష తేదీ- 2020 డిసెంబర్ 20
విద్యార్హతలు- బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. పూర్తి వివరాలు నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు.
వయస్సు- 20 నుంచి 25 ఏళ్లు
దరఖాస్తు ఫీజు- రూ.200. మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
UPSC CAPF Recruitment 2020: అప్లై చేయండి ఇలా
అభ్యర్థులు ముందుగా https://upsconline.nic.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో Central Armed Police Forces (Assistant Commandants) Examination నోటిఫికేషన్ ఉంటుంది.
ఆ సెక్షన్లో మొదట Part-I రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
మీ వివరాలతో పార్ట్ 1 రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత పార్ట్ 2 రిజిస్ట్రేషన్ చేయాలి.
ఫీజు చెల్లించి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.