హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UpGrad: అప్‌గ్రాండ్ నుంచి డేటా సైన్స్ బూట్ క్యాంప్ ప్రారంభం.. కోర్సు అర్హత, ఇతర వివరాలిలా..

UpGrad: అప్‌గ్రాండ్ నుంచి డేటా సైన్స్ బూట్ క్యాంప్ ప్రారంభం.. కోర్సు అర్హత, ఇతర వివరాలిలా..

ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ అప్‌గ్రాడ్ నాలెడ్జ్‌హట్(UpGrad KnowledgeHut) తన మొట్టమొదటి 'డేటా సైన్స్ బూట్‌ క్యాంప్'(Data Science Bootcamp)ను ప్రారంభించింది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన ఫ్రెషర్స్ దీనికి అర్హులు.

ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ అప్‌గ్రాడ్ నాలెడ్జ్‌హట్(UpGrad KnowledgeHut) తన మొట్టమొదటి 'డేటా సైన్స్ బూట్‌ క్యాంప్'(Data Science Bootcamp)ను ప్రారంభించింది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన ఫ్రెషర్స్ దీనికి అర్హులు.

ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ అప్‌గ్రాడ్ నాలెడ్జ్‌హట్(UpGrad KnowledgeHut) తన మొట్టమొదటి 'డేటా సైన్స్ బూట్‌ క్యాంప్'(Data Science Bootcamp)ను ప్రారంభించింది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన ఫ్రెషర్స్ దీనికి అర్హులు.

    ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ అప్‌గ్రాడ్(UpGrad) నాలెడ్జ్‌హట్(UpGrad Knowledge Hut) తన మొట్టమొదటి 'డేటా సైన్స్ బూట్‌ క్యాంప్'(Data Science Bootcamp)ను ప్రారంభించింది. బ్యాచిలర్ డిగ్రీ(Bachelor Degree) పూర్తిచేసిన ఫ్రెషర్‌లతో(Fresher) పాటు స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్(Economics), బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(Business Admiration), యాడ్ స్ట్రీమ్‌లకు చెందిన వ్యక్తులు ఈ ప్రోగ్రామ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సును మూడు నెలలపాటు బ్లెండెడ్ ఫార్మాట్‌(blended format)లో నిర్వహించనున్నారు. లైవ్ సెషన్‌(Live Session)లనూ నిర్వహించనున్నారు.

    ‘‘మూడు నెలల పాటు జరిగే డేటా సైన్స్ బూట్‌క్యాంప్ ప్రకృతితో మిళితం అవుతుంది. ఇక్కడ సెల్ఫ్ బేస్డ్ కంటెంట్‌తో పాటు ఇన్‌స్టక్టర్లు నిర్వహించే ప్రత్యక్ష సెషన్ల (live sessions) వల్ల అభ్యర్థులకు మేలు జరగనుంది. శిక్షణ ద్వారా వాస్తవ ప్రపంచ అనుభవాలను పొందడం, ప్రాజెక్ట్‌ల పోర్ట్‌ఫోలియోను రూపొందించడం ద్వారా అభ్యర్థులను పరిశ్రమకు సిద్ధం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాం." అని బెంగళూరుకు చెందిన టెక్నాలజీ స్కిల్లింగ్ ప్రొవైడర్ అప్‌గ్రాడ్ నాలెడ్జ్‌హట్ ఓ ప్రకటనలో తెలిపింది.

    Top 10 Companies: బెస్ట్ కంపెనీలో జాబ్ కోసం చూస్తున్నారా..? లింక్డ్‌ఇన్‌ ప్రకటించిన టాప్‌-10 కంపెనీలు ఇవే..

    అప్‌గ్రాడ్ నాలెడ్జ్ హట్ సీఈవో, వ్యవస్థాపకుడు సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ...డేటా సైన్స్ అనేది మల్టిపుల్ డేటా ఆపరేషన్లు నిర్వహించే అపారమైన కొలను వంటిదన్నారు. విశ్లేషణ, ప్రాసెస్ చేయడం, ఆపై ఫలితాలను వివరించడంలో డేటా సైన్స్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. కంపెనీలు, ఇతర సంస్థల కోసం కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడానికి డేటా సైన్స్ ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుత పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సంపూర్ణ అభ్యాస అనుభవాన్ని అభ్యర్థులకు అందించడానికి ఉన్న మార్గాల్లో డేటా సైన్స్ బూట్‌క్యాంప్‌ ఒకటన్నారు. తద్వారా డేటా సైన్స్ చురుకైన వర్క్‌ఫోర్స్‌ను రూపొందించడానికి తాము ఎదురుచూస్తున్నామని సుబ్రహ్మణ్యం రెడ్డి తెలిపారు.

    ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు తమ అతిపెద్ద ఆస్తిగా డేటాను గుర్తిస్తున్నాయని అప్‌గ్రాడ్ పేర్కొంది. సంస్థ వృద్ధి, ఆప్టిమైజేషన్‌ కోసం కంపెనీలు నిర్ణయాలు తీసుకోవడంలో డేటా కీలక పాత్ర పోషిస్తుంది. రిక్రూట్‌మెంట్ సంస్థ మైఖేల్ పేజ్ ఇండియా ‘ది హ్యూమన్స్ ఆఫ్ డేటా సైన్స్’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. 2026 నాటికి డేటా సైన్స్ దాదాపు 11.5 మిలియన్ ఉద్యోగాలను సృష్టిస్తుందని వెల్లడించింది. లింక్డ్‌ఇన్ ‘ఎమర్జింగ్ జాబ్స్ రిపోర్ట్ డేటా సైన్స్‌’ను అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగంగా పేర్కొంది. అందుకు తగ్గట్లుగానే 2012 నుండి అది 650 శాతానికి పైగా వృద్ధిని సాధించిందని తెలిపింది. ఈ వృద్ధిరేటు 2026 నాటికి 230.80 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని మైఖేల్ పేజ్ ఇండియా తన నివేదికలో వెల్లడించింది.

    StandUp India Scheme: ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాల వారికి, మహిళలకు రూ.10 లక్షల నుంచి లోన్

    డేటా సైన్స్‌, కృత్రిమ మేధస్సు రంగంలో నిపుణులను పెంపొందించే లక్ష్యంతో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలేజీలను ఐఐటీ రూర్కీ ఏర్పాటు చేయనుంది. ఇందులో బ్యాచిలర్స్, మాస్టర్స్, డాక్టోరల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లపై కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. 2022 సెప్టెంబర్‌లో బ్యాచిలర్ డిగ్రీ విద్యార్థులతో దీన్ని ప్రారంభించనున్నారు. ఈ కాలేజీలను అమెరికాలోని మెహతా ఫ్యామిలీ ఫౌండేషన్ (ఎంఎఫ్ఎఫ్) సహకారంతో ఏర్పాటు చేయనున్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం 2020లో 124 డిగ్రీ కాలేజీల్లో బీఎస్సీ డేటా సైన్స్ కోర్సును ప్రవేశపెట్టింది. డేటా సైన్స్ బోధించే అధ్యాపకులకు శిక్షణ సైతం ఇవ్వనున్నారు.

    First published:

    Tags: Career and Courses, EDUCATION, Knowledge, Students

    ఉత్తమ కథలు