UPGRAD LAUNCHES SHORT TERM COURSES IN CYBERSECURITY DATA ANALYTICS GH VB
MNC Jobs: టాప్ ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు.. ఈ కోర్సు నేర్చుకుంటే చాలు.. పూర్తి వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
MNC Company Jobs: టాప్ ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు.. ఈ కోర్సు నేర్చుకుంటే చాలు.. ఆన్లైన్లో హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అందిస్తున్న ఎడ్టెక్ కంపెనీ అప్‌గ్రాడ్ రెండు కొత్త సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించింది. ఇందు కోసం ఫుల్‌స్టాక్ అకాడమీ, కాల్టెక్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఆన్లైన్లో హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అందిస్తున్న ఎడ్టెక్ కంపెనీ (Ed.tech company) అప్‌గ్రాడ్ (upGrad) రెండు కొత్త సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లను (Certificate programmes) ప్రారంభించింది. ఇందు కోసం ఫుల్‌స్టాక్ అకాడమీ, కాల్టెక్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థల భాగస్వామ్యంతో సైబర్ సెక్యూరిటీ(Cyber Security), డేటా అనలిటిక్స్‌లో(Data Analytics) షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్‌లను(Shortterm Programmes) ఆఫర్ చేస్తుంది. ఈ రెండు కొత్త ప్రోగ్రామ్‌లను సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న ప్రొఫెషనల్స్ కోసం రూపొందించింది. సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ 29 వారాలు, డేటా అనలిటిక్స్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ 36 వారాల వ్యవధి కలిగి ఉంటాయి.
ఈ రెండు కొత్త కోర్సులను కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్టెక్)కి చెందిన సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ విభాగంల్ని సాఫ్ట్వేర్ నిపుణులు రూపొందించారు. కోర్సులో భాగంగా లైవ్, రికార్డ్ సెషన్స్ ద్వారా ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. ఫ్రెషర్లతో పాటు ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న సాఫ్ట్వేర్ నిపుణులు సైతం ఈ కొత్త కోర్సులను సులభంగా నేర్చుకోవచ్చు.
కోర్సులో భాగంగా నెట్వర్కింగ్ సెషన్లు, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, మాక్ ఇంటర్వ్యూ సెషన్లను కూడా నిర్వహిస్తారు. లెర్నర్స్ తమ కెరీర్లో ఉత్తమ ఫలితాలను పొందడంలో ఈ కోర్సు సహాయపడుతుందని అప్‌గ్రాడ్ సంస్థ తెలిపింది.
ఈ కొత్త కోర్సులపై ఫుల్‌స్టాక్ అకాడమీ ప్రెసిడెంట్ జెర్రాడ్ టౌజ్ మాట్లాడుతూ, “సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ నిపుణులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఫ్రెషర్లతో పాటు నిపుణులు సైతం కొత్త టెక్నాలజీలపై పట్టు సాధించేలా కోర్సును రూపొందించాం. ఈ ఆన్లైన్ కోర్సు ద్వారా విద్యార్థులు టాప్ ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. వీరికి భారీ వేతనాలు లభిస్తాయి.” అని చెప్పారు.
ఈ కోర్సు లాంచింగ్‌పై అప్‌గ్రాడ్ సహ వ్యవస్థాపకుడు ఫాల్గుణ్ కొంపల్లి మాట్లాడుతూ, “మహమ్మారి కారణంగా ఐటీ రంగంలో నిపుణుల కొరత ఏర్పడింది. అందుకే కాల్టెక్ ప్రోగ్రామ్‌లను భారతీయ నిపుణులకు చేరువ చేయడమే లక్ష్యంగా ఫుల్‌స్టాక్ అకాడమీతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. తద్వారా దేశ జీడీపీని పునరుద్ధరించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం.” అని చెప్పారు.
దీనిపై కాల్టెక్ CTME ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రిక్ మాట్లాడుతూ ‘‘అప్‌గ్రాడ్, ఫుల్‌స్టాక్ అకాడమీ భాగస్వామ్యం ద్వారా మా యుఎస్ ఆధారిత ప్రోగ్రామ్‌ను భారతీయ టెక్ నిపుణులకు చేరువ చేస్తున్నాం. వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ ల్యాండ్‌స్కేప్‌లో నిపుణుల కొరత వేధిస్తోంది. అందువల్ల, నైపుణ్యం సాధించాలని చూస్తున్న విద్యార్థులు, టెక్ నిపుణులకు ఈ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయి" అని వివరించారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.