హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NSE అకాడమీతో UPES బిజినెస్ స్కూల్ ఒప్పందం.. విద్యార్ధులకు గోల్డెన్ ఛాన్స్..!

NSE అకాడమీతో UPES బిజినెస్ స్కూల్ ఒప్పందం.. విద్యార్ధులకు గోల్డెన్ ఛాన్స్..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌పై తమ విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం NSE అకాడమీతో ఒప్పందం చేసుకుంది UPES బిజినెస్ స్కూల్. BBA, MBA విద్యార్థులకు ట్రేడిండ్, ఇన్వెస్ట్‌మెంట్, ఇతర అంశాలపై అవగాహన కల్పించడం ఈ ఒప్పందం లక్ష్యం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌ (Stock Market Trading)పై తమ విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం NSE అకాడమీతో ఒప్పందం చేసుకుంది UPES బిజినెస్ స్కూల్. యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం & ఎనర్జీ స్టడీస్‌గా వ్యవహరించే ఈ సంస్థ.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంచ్ అనుబంధ సంస్థ అయిన NSE అకాడమీతో కలిసి స్మార్ట్‌ ఫిన్ ల్యాబ్‌ను (NSE SMART Fin Lab) చేయనుంది. దీని ద్వారా BBA, MBA విద్యార్థులకు ట్రేడిండ్, ఇన్వెస్ట్‌మెంట్, ఇతర అంశాలపై అవగాహన కల్పించడం ఈ ఒప్పందం లక్ష్యం.

తమ విద్యార్థులకు ఫైనాన్స్ అండ్ ట్రేడింగ్ రంగంలో అవసరమైన నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో NSE అకాడమీతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు UPES స్కూల్ ఆఫ్ బిజినెస్ డైరెక్టర్, రాహుల్ నైన్వాల్. UPES స్కూల్ ఆఫ్ బిజినెస్‌లోని అకడమిక్స్ కొత్త టెక్నాలజీపై దృష్టి సారిస్తుందన్నారు. టెక్నాలజీ అనేది వ్యాపార స్వభావం, వినియోగదారుల అనుభవాలు, వాటాదారుల మధ్య డైనమిక్‌లను వేగంగా ట్రాన్స్‌ఫామ్ చేస్తుందని చెప్పారు. వర్క్ ప్లేస్‌లో మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు విద్యార్థులను సిద్ధం చేస్తామని రాహుల్ తెలిపారు.

ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఈ అకాడమీ లిమిటెడ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అభిలాష్‌ మిశ్రా మాట్లాడుతూ.. పెట్టుబడి పెట్టడానికి, కెరీర్ కొనసాగించడానికి క్యాపిటల్ మార్కెట్లలో చురుకుగా పాల్గొనాలని UPES విద్యార్థులకు సూచించారు. వారిలో పోటీ నైపుణ్యాలను పెంపొందించడానికి ఎన్‌ఎస్‌ఈ అకాడమీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

* విద్యార్థులకు ప్రయోజనాలు

NSE స్మార్ట్ ఫిన్ ల్యాబ్‌ ద్వారా బిజినెస్ స్కూల్ స్టూడెంట్స్‌కు ఫైనాన్స్, టెక్నాలజీ రంగంలో లెర్నింగ్ అవకాశాలను అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడ విద్యార్థులు ఆర్థికపరమైన రిస్క్ లేకుండా ట్రేడింగ్ సెక్యూరిటీలను నేర్చుకోవచ్చు. ప్రాక్టీస్ చేయడానికి ట్రేడింగ్ టెర్మినల్స్‌లో లైవ్ ఈక్విటీ, డెరివేటివ్, కరెన్సీ డెరివేటివ్స్ వంటి మార్కెట్ ఫీచర్స్‌ను ఈ ల్యాబ్ రీప్రొడ్యూస్ చేస్తుంది. ఆర్థిక, సాంకేతిక రంగంలో పూర్తిస్థాయి అవగాహన, సామర్థ్యాలను పెంపొందించుకోవాలనే విద్యార్థుల కోసం షార్ట్‌టర్మ్, లాంగ్‌టర్మ్ ప్రోగ్రామ్స్‌ను కూడా ఆఫర్ చేస్తుంది.

ఇది కూడా చదవండి : ఆర్కిటెక్చర్ ఫీల్డ్‌లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు.. ఇంటి దగ్గర నుంచే.. పూర్తి వివరాలివే..

* ప్రోగ్రామ్స్‌ టాఫిక్స్..

ఫైనాన్షియల్ టెక్నాలజీ, బ్లాక్ చైన్ మేనేజ్‌మెంట్, డేటా సైన్స్, అనలిటిక్స్ ఫర్ ఫైనాన్స్, మెషిన్ లెర్నింగ్, ఫైథాన్ ఫర్ ఫైనాన్స్, బిజినెస్ అనలిటిక్స్, ఫైనాన్స్ ఫర్ నాన్-ఫైనాన్స్, స్టాటిస్టిక్స్ ఫైనాన్స్, ఫైనాన్షియల్ వాల్యుయేషన్ అండ్ మోడలింగ్‌తో పాటు బీఎఫ్‌ఎస్‌ఐ సంబంధిత సాంకేతిక రంగానికి చెందిన సబ్జెక్ట్స్‌ వంటి అంశాలపై ఈ ప్రోగ్రామ్స్ ద్వారా అభ్యర్థులకు అవగాహన కల్పించనున్నారు. అన్ని ప్రోగ్రామ్స్ ఆఫ్‌లైన్ మోడ్‌లో డెలివరీ చేయనున్నారు.

UPES అంటే యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం & ఎనర్జీ స్టడీస్. ఇది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఉంది. దీన్ని 20003లో ఏర్పాటు చేశారు. దేశంలోని అగ్రశ్రేణి ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఇది ఒకటి. 2022- NIRF ర్యాంకింగ్‌లో ఈ సంస్థ పేరు ఉంది. ఇది వందకు పైగా డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, Stock Market, Trade

ఉత్తమ కథలు