ప్రతిభకు పేదరికం అడ్డుకాదు.. ఈ నిరుపేద విద్యార్థే ఉదాహరణ.. 99 శాతం మార్కులతో రికార్డు

హ్యాపీ కుమార్

ఆర్థికంగా వెనుకబడిన తరగతికి చెందిన హ్యాపీ విద్యాగ్యాన్ బులంద్ షహర్ స్కూల్లో చదువుకున్నాడు. ఈ స్కూల్ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తోంది. హ్యాపీ తండ్రి ఓ చిన్న స్టోర్ ఓనర్. తల్లి గృహిణి.

  • Share this:
సీబీఎస్ఈ పరీక్షల ఫలితాలు ఎంతో మంది విద్యార్థుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశాయి. ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా మంచి మార్కులు సంపాదించారు. అలాంటివారిలోనే ఒకరు ఉత్తర్ ప్రదేశ్ లోని శరన్ పుర్ కి చెందిన హ్యాపీ కుమార్.. ఈ కుర్రాడు ఆన్ లైన్ క్లాసుల సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అయితేనేం.. సీబీఎస్ఈ పరీక్షల్లో అత్యద్భుతమైన మార్కులు సాధించాడు. ప్రస్తుతం ఇంజినీరింగ్ చేయాలనే లక్ష్యంతో JEE మెయిన్స్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ నెలాఖరులో ఉన్న ఆ పరీక్ష రాసి ఐఐటీల్లో ఇంజినీరింగ్ చేయాలనేదే తన లక్ష్యం అని వెల్లడిస్తున్నాడు.

సీబీఎస్ఈ పరీక్షల్లో 91 శాతం సాధించిన హ్యాపీ కుమార్.. JEE మెయిన్స్ మార్చి సెషన్ లో 96 శాతం సాధించాడు. తన మార్కుల గురించి మాట్లాడుతూ "నేను ప్రస్తుతం ఉంటున్న ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. నాకు లాప్ టాప్ లేదు. దీంతో ఫోన్ ద్వారా క్లాసులు అటెండ్ అయ్యేవాడిని. నెట్ వర్క్ ఉన్నప్పుడు మాత్రమే క్లాసులు అటెండ్ అయ్యేవాడిని. " అని వెల్లడించాడు. స్కూల్స్ మూతబడి ఉండడం, నెట్ వర్క్ పెద్దగా లేకపోవడం వల్ల క్లాసులు వినలేకపోవడం వంటి వల్ల హ్యాపీ కుమార్ చాలా బాధపడ్డాడు. యూట్యూబ్ లో క్లాసులు విని దాని ప్రకారం తన వీలును బట్టి చదువుకునేవాడట.

"మా స్కూల్ వారు శని, ఆది వారాల్లో JEE కోసం క్లాసులు నిర్వహించేవారు. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితుల వల్ల ఆ క్లాసులు కూడా మూతబడ్డాయి. అందుకే నేను సొంతంగానే చదువుకోవడం ప్రారంభించాను. యూట్యూబ్ లో ఆన్ లైన్ లెసన్స్ ఉంటే వాటిని వినేవాడిని. దీంతో పాటు అన్ అకాడమీలోని కొన్ని ఫ్రీ కోర్సులను కూడా చేశాను. వీటి ద్వారా నేను సులువుగా నా పరీక్షలతో పాటు JEEకి కూడా సిద్ధం కాగలిగాను." అని వెల్లడించాడు.

ఈ సంవత్సరం 12వ తరగతి విద్యార్థులు 10,11,12 క్లాసుల్లో ఇంటర్నల్ మార్కుల ఆధారంగా తమ స్కోర్ సాధించారు. ముందు నుంచి మంచి మెరిట్ స్టూడెంట్ కావడంతో హ్యాపీ బోర్డ్ పరీక్షలో కూడా మంచి మార్కులు సాధించాడు. 500 కి గాను 496 మార్కులు సాధించాడు. కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇన్ఫర్మేషన్ ప్రాక్టీస్ లలో 100 కి 100 మార్కులు సాధించాడు. ఫిజిక్స్, ఇంగ్లిష్ లలో 98 మార్కులు సాధించాడు. దీంతో సీబీఎస్ఈ పరీక్షల్లో 99.2 మార్కులు సాధించి పరీక్షలు రాసిన 14 లక్షల మందిలో టాప్ లో నిలిచిన 70 వేల మంది విద్యార్థుల్లో ఒకరిగా నిలిచారు.

ఆర్థికంగా వెనుకబడిన తరగతికి చెందిన హ్యాపీ విద్యాగ్యాన్ బులంద్ షహర్ స్కూల్లో చదువుకున్నాడు. ఈ స్కూల్ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తోంది. హ్యాపీ తండ్రి ఓ చిన్న స్టోర్ ఓనర్. తల్లి గృహిణి. అతడికి ఇద్దరు తోబుట్టువులు కూడా ఉన్నాయి. అతడి అక్క బీఏ రెండో సంవత్సరం చదువుతుంటే, తమ్ముడు ఫస్టియర్ చదువుతున్నాడు. హ్యాపీ ప్రస్తుతం JEE మెయిన్స్ కి సిద్ధమవుతున్నాడు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్ అవ్వాలనేది తన లక్ష్యం. ఆర్టిఫిషియల్ టెక్నాలజీ (AI) అంటే నాకు చాలా ఇష్టం. అందుకే దాన్ని చదవాలనుకుంటున్నా అని వెల్లడించాడు.

ఇప్పటికే హ్యాపీ కుమార్ శివ్ నాడార్ యూనివర్సిటీ, నోయిడాలో అడ్మిషన్ తీసుకున్నాడు. కంప్యూటర్ సైన్స్ లో బీ టెక్ కోర్సు చేయనున్నాడు. దీనికి గాను అతడికి స్కాలర్ షిప్ కూడా దక్కనుంది. అయితే దీంతో పాటు మరోసారి కూడా JEE పరీక్షలు రాయనున్నాడు. ఒకవేళ ఇది పాసై మంచి మార్కులు సాధిస్తే IIT లేదా NIT లో చేరి ఇంజినీరింగ్ చేయాలనేది అతడి లక్ష్యం. ఐఐటీ కాన్పూర్, రూర్కీ, దిల్లీల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలని హ్యాపీ భావిస్తున్నాడట. తన ఇంటికి దగ్గరగా ఉండడమే దీనికి కారణం.

ఇవి కూడా చదవండి:

ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఈ నెలలోనే గ్రూప్1, గ్రూప్2 నోటిఫికేషన్..

నిరుద్యోగులకు శుభవార్త.. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి
Published by:Shiva Kumar Addula
First published: