లక్నో మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అని కూడా పిలువబడే ఉత్తర ప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (UPMRCL) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఇంజనీర్, ఇతర పోస్టులకు నియమించబడతారు. ఆసక్తి గల అభ్యర్థులు lmrcl.com అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్లైన్లో(Onlile) దరఖాస్తు చేసుకోవచ్చు.రిజిస్ట్రేషన్(Registration) ప్రక్రియ నవంబర్ 01, 2022 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 30. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 142 ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తారు. అభ్యర్థులు ముఖ్యమైన తేదీలు, ఖాళీలు మరియు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.
ఖాళీల వివరాలు
అసిస్టెంట్ మేనేజర్ (సివిల్): 16 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్): 08 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్ (S&T): 05 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్ (ఖాతా): 01 పోస్ట్
జూనియర్ ఇంజనీర్ (సివిల్): 43 పోస్టులు
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్): 49 పోస్టులు
జూనియర్ ఇంజనీర్ (S&T): 17 పోస్టులు
అకౌంట్ అసిస్టెంట్: 02 పోస్టులు
అర్హతలు..
అసిస్టెంట్ మేనేజర్ (సివిల్): సివిల్ ఇంజనీరింగ్‌లో BE/B.Tech లేదా తత్సమాన డిగ్రీ ఉండాలి. అన్రిజర్వ్డ్, EWS & OBC అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు 60 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. SC, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేస్తే సరిపోతుంది.
అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్): ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో BE/B.Tech లేదా తత్సమాన డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అన్రిజర్వ్డ్, EWS అండ్ OBC అభ్యర్థులు 60 శాతమ మార్కులను డిగ్రీలో పొంది ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్ (S&T): ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో BE/B.Tech పూర్తి చేసి ఉండాలి. అన్రిజర్వ్డ్ అండ్ EWS అభ్యర్థులకు 60 శాతం మార్కులను డిగ్రీలో పొంది ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు 50శాతం మార్కులు పొందినా సరిపోతుంది.
ముఖ్యమైన తేదీలు..
నోటిఫికేషన్ జారీ చేసే తేదీ: నవంబర్ 1, 2022
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: నవంబర్ 1, 2022
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు తేదీ: నవంబర్ 3, 2022
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి తేదీలు: డిసెంబర్ 15, 2022
రాత పరీక్ష యొక్క తాత్కాలిక తేదీ (CBT): 02.01.2023 అండ్ 03.01.2023
జీతం వివరాలిలా..
అసిస్టెంట్ మేనేజర్ (సివిల్): రూ. 50,000- 1,60,000
అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్): రూ. 50,000- 1,60,000
అసిస్టెంట్ మేనేజర్ (S&T): రూ. 50,000- 1,60,000
అసిస్టెంట్ మేనేజర్ (ఖాతా): రూ. 50,000- 1,60,000
జూనియర్ ఇంజనీర్ (సివిల్): రూ. 33,000- 67,300
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్): రూ. 33,000- 67,300
జూనియర్ ఇంజనీర్ (S&T): రూ. 33,000- 67,300
అకౌంట్ అసిస్టెంట్: రూ. 25,000-51,000
ఆఫీస్ అసిస్టెంట్ హెచ్ఆర్: రూ. 25,000-51,000
దరఖాస్తు విధానం ఇలా..
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
-ఇక్కడ నోటిఫికేషన్ ను డౌన్ లోడ్ చేసుకొని వివరాలను క్షణ్ణంగా తనిఖీ చేయండి. ఆ తర్వాత దరఖాస్తు చేసుకోండి.
-ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలంటే.. నవంబర్ 1 నుంచి చేసుకోవచ్చు. లింక్ ఆ తేదీన యాక్టివేట్ అవుతంది.
-పూర్తి వివరాల కోసం ఇక్కడ తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Indian Railway, JOBS, Jobs in railway, Metro, Railway jobs, Uttar pradesh