UOH RECRUITMENT 2022 UNIVERSITY OF HYDERABAD RELEASED JOB NOTIFICATION FOR 4 GUEST FACULTY POSTS SS
UOH Recruitment 2022: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఖాళీలు... పరీక్ష లేకుండా ఉద్యోగం
UOH Recruitment 2022: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఖాళీలు... పరీక్ష లేకుండా ఉద్యోగం
(ప్రతీకాత్మక చిత్రం)
UOH Recruitment 2022 | యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UOH) గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
కేంద్రీయ విశ్వవిద్యాలయమైన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UOH) పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఈ విశ్వవిద్యాలయంలో గెస్ట్ ఫ్యాకల్టీ (Guest Faculty) పోస్టుల భర్తీ జరుగుతోంది. మొత్తం 4 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 జనవరి 24 చివరి తేదీ. పరీక్ష లేకుండా నేరుగా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
UOH Recruitment 2022: కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు ఇవే...
విద్యార్హతలు- స్టాటిస్టిక్స్‌లో ఎంఎస్సీ 55 శాతం మార్కులతో పాస్ కావాలి. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) లేదా స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (SLET) క్వాలిఫై కావాలి.
ఇతర నిబంధనలు- స్టాటిస్టిక్స్‌లో పీహెచ్డీ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. స్టాటిస్టిక్స్‌లో పీహెచ్డీ థీసిస్ సబ్మిట్ చేసి వైవా వోసి పూర్తి చేసినవారిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. సూపర్ యాన్యుయేటెడ్ టీచర్లను కూడా గెస్ట్ ఫ్యాకల్టీగా నియమిస్తారు. వారి గరిష్ట వయస్సు 70 ఏళ్ల లోపు ఉండాలి.
అపాయింట్మెంట్- ఇవి తాత్కాలిక పోస్టులు మాత్రమే. కేవలం 2022 ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఒక సెమిస్టర్ కోసమే నియమిస్తున్నారు. ఆ తర్వాత అవసరాలను బట్టి టర్మ్ ఆఫ్ అపాయింట్మెంట్ పొడిగించే అవకాశం ఉంది.
ఎంపిక విధానం- ఇంటర్వ్యూ
పారితోషికం- ఒక లెక్చర్‌కు రూ.1,500 చొప్పున చెల్లిస్తారు. గరిష్టంగా నెలకు రూ.50,000 వరకు వేతనం లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.