హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

University of Madras: స్వదేశంలోనే ఉండి విదేశీ యూనివర్శిటీ గైడెన్స్‌తో చదివే ఛాన్స్.. పూర్తి వివరాలివే..

University of Madras: స్వదేశంలోనే ఉండి విదేశీ యూనివర్శిటీ గైడెన్స్‌తో చదివే ఛాన్స్.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

University of Madras: ఈ కోర్సు సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు ఈ బ్లెండెడ్ మోడ్ లేదా హైబ్రిడ్ లెర్నింగ్ విధానంలో సబ్జెక్ట్స్ పైన మరింత అవగాహన పెంచుకోవచ్చు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

స్వదేశంలోనే ఉండి విదేశీ యూనివర్సిటీ (University) గైడెన్స్‌తో బీఎస్సీ కోర్సును బ్లెండెడ్ మోడ్‌లో పూర్తి చేసే అవకాశం కల్పిస్తోంది మద్రాసు యూనివర్సిటీ. ఎంట్రన్స్ స్కోరు ఆధారంగా 30 మంది విద్యార్థులను ఈ కోర్సు కోసం ఎంపిక చేయనున్నారు. తమిళనాడు ప్రభుత్వ రోస్టర్ సిస్టమ్‌ను ఇందుకు అనుసరించనున్నారు. ఆ కోర్సు పూర్తి వివరాలు మీ కోసం.. మద్రాసు యూనివర్సిటీ (University of Madras), మెల్‌బోర్న్ యూనివర్సిటీలు (University of Melbourne) బీఎస్సీ కోర్సును బ్లెండెడ్ మోడ్‌లో అందజేసేందుకు తాజాగా ఒప్పందం (MoU) కుదుర్చుకున్నాయి. దీని ద్వారా అంతర్జాతీయ స్థాయి విద్యను ఈ రెండు విశ్వవిద్యాలయాలు కలిసి అందించనున్నాయి.

అంటే విద్యార్థులు యూనివర్సిటీ ఆఫ్ మద్రాసుతో పాటు యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్ అధ్యాపకులతో ఇంటరాక్ట్ కావచ్చు. ఈ ఒప్పందం జాయింట్ టీచింగ్ ప్రోగ్రామ్స్‌కు (అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలలో సైన్స్, హ్యుమానిటీస్, ఆర్ట్స్, సోషల్ సైన్సెస్‌లో బ్లెండెడ్, డ్యుయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు) మార్గం సుగమం చేస్తుంది.

* కోర్సు ప్రారంభం ఎప్పుడు?

ఈ కోర్సు సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు ఈ బ్లెండెడ్ మోడ్ లేదా హైబ్రిడ్ లెర్నింగ్ విధానంలో సబ్జెక్ట్స్ పైన మరింత అవగాహన పెంచుకోవచ్చు. నాలెడ్జ్‌ను షేర్ చేసుకోవచ్చు. దాంతో పాటు విదేశీ సంస్కృతి పట్ల అవగాహన ఏర్పరుచుకోవచ్చు. మద్రాసు యూనివర్సిటీలోని 86 డిపార్ట్‌మెంట్ల అధ్యాపకులతో పాటు మెల్‌బోర్న్ యూనివర్సిటీ అధ్యాపకులతో ఏ విషయంలోనైనా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఫలితంగా విషయం పరిజ్ఞానం కలుగుతుంది.

తాజా ఒప్పందం ద్వారా తమ విద్యార్థుల ఎక్స్‌పోజర్ పెరుగుతుందని, రీసెర్చ్ ఎబిలిటీస్ పెరుగుతాయని మద్రాసు యూనివర్సిటీ వీసీ, ప్రొఫెసర్, డాక్టర్ ఎస్.గౌరి తెలిపారు. రీసెర్చ్ స్కాలర్స్‌కు ప్రపంచ స్థాయి నిపుణుల సలహాలు, మార్గదర్శకాలు లభిస్తాయని తద్వారా వారికి సబ్జెక్ట్స్‌పైన ఇంకా అవగాహన వస్తుందని యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్ డిప్యూటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ మైఖేల్ వెస్లీ చెప్పారు. మద్రాసు యూనివర్సిటీతో భాగస్వామ్య ఒప్పందం తమకు అతి ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : నిరుద్యోగులకు అలర్ట్.. ఎయిర్పోర్ట్ అథారిటీలో 156 జాబ్స్ .. ఇలా అప్లై చేయండి

ఈ ఎంవోయూతో భవిష్యత్తులో జాయింట్ టీచింగ్ ప్రోగ్రామ్స్ సాధ్యపడొచ్చు. రెండు విశ్వ విద్యాలయాలు సంయుక్తంగా పీహెచ్‌డీ అవకాశాలు ఇచ్చేందుకు భవిష్యత్తులో అంగీకరించొచ్చు. అలాగే బ్లెండెడ్, డ్యుయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్‌ను అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవల్స్‌లో‌నూ అందించేందుకు అడుగులు పడొచ్చు. హ్యూమనిటీస్, సైన్స్, ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్‌లోనూ బ్లెండెడ్ ప్రోగ్రామ్స్ రావచ్చు.

తద్వారా ఆయా విభాగాల విద్యార్థులకు గ్లోబల్ ఎక్స్‌పోజర్ ఈజీగా రావచ్చు. దీనిద్వారా పరిశోధన రంగంలోనూ నైపుణ్యాలను సాధించగలుగుతారు. ఫలితంగా వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. అలాగే రెండూ వర్సిటీలు కలిసి భవిష్యత్తులో విద్యార్థులకు సస్టెయినెబుల్ ట్రాన్స్‌నేషనల్ ఎడ్యుకేషన్(TNE), ట్రాన్స్‌నేషనల్ రీసెర్చ్ (TNR) ప్రోగామ్స్ అందించవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, Career opportunities, EDUCATION, JOBS

ఉత్తమ కథలు