Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    Exams: పరీక్షల సీజన్ మొదలైంది... సెప్టెంబర్‌లో హెచ్‌సీయూ ఎంట్రెన్స్ ఎగ్జామ్

    University of Hyderabad | యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనుంది.

    news18-telugu
    Updated: August 19, 2020, 7:01 PM IST
    Exams: పరీక్షల సీజన్ మొదలైంది... సెప్టెంబర్‌లో హెచ్‌సీయూ ఎంట్రెన్స్ ఎగ్జామ్
    Exams: పరీక్షల సీజన్ మొదలైంది... సెప్టెంబర్‌లో హెచ్‌సీయూ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (ప్రతీకాత్మక చిత్రం)
    • Share this:
    కరోనా వైరస్ సంక్షోభం కారణంగా అనేక పరీక్షలు వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించిన తర్వాత కూడా పరీక్షల్ని నిర్వహించేందుకు విద్యా సంస్థలు వెనుకడుగు వేస్తున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్-JEE 2020, నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్-NEET లాంటి పరీక్షల్ని కూడా వాయిదా వేయాలంటూ విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్లను కోర్టు కొట్టేసింది. దీంతో జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షల నిర్వహణకు అడ్డుతొలగింది. జేఈఈ మెయిన్ 2020 అడ్మిట్ కార్డులు వచ్చేశాయి. పరీక్షల్ని వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టేయడంతో ఇతర విద్యా సంస్థలు కూడా పరీక్షల్ని నిర్వహించేందుకు కసరత్తు మొదలుపెట్టాయి.

    IBPS PO: డిగ్రీ పాసైనవారికి 1167 బ్యాంకు ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

    Army Jobs: టెన్త్ పాసైన అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

    యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు దేశంలోని 38 కేంద్రాల్లో ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించనుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌తో పాటు రీసెర్చ్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించనుంది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణకు సుప్రీం కోర్టు ఆమోదం తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ అప్పారావు తెలిపారు. సుమారు 62,000 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తారని అంచనా. నవంబర్ మొదటి వారంలోగా అడ్మిషన్ల ప్రక్రియ ముగించి తరగతుల్ని ప్రారంభిస్తామని ఆయన అన్నారు.
    Published by: Santhosh Kumar S
    First published: August 19, 2020, 6:57 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading