University of Hyderabadలో ఉద్యోగాలు.. రూ.2.18 లక్షల వరకు వేతనం.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (University of Hyderabad) పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు యూనివర్సిటీ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    హైదరాబాద్ లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (University of Hyderabad) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 52 ఖాళీలను (Job Vacancies) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.  ప్రొఫెసర్ (Professor), అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor), అసోసియేట్ ప్రొఫెసర్ (Associate Professor) విభాగాల్లో ఈ ఖాళీలు (Job Vacancies)ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్/ఆఫ్ లైన్ విధానంలో అప్లై (Job Application) చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఆన్లైన్ దరఖాస్తుల (Online Applications) ప్రక్రియను ఇంకా ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీని సైతం ప్రకటించలేదు. ఈ వివరాలను త్వరలో వెల్లడిస్తామని నోటిఫికేషన్లో (Notification) పేర్కొన్నారు. పోస్టు/కొరియర్ ద్వారా ఆఫ్ లైన్ దరఖాస్తులను డిసెంబర్ 12వ తేదీ వరకు స్వీకరిస్తామని నోటిఫికేషన్లో తెలిపారు.

    పోస్టుల వారీగా ఖాళీల వివరాలు..




















    పోస్టు ఖాళీలు
    ప్రొఫెసర్లు 16
    అసోసియేట్ ప్రొఫెసర్లు 31
    అసిస్టెంట్ ప్రొఫెసర్లు 05

    విభాగాలు:
    మాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్, స్కల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, ప్లాన్ సైన్సెస్, Animal Biology, ఇంగ్లిష్, తెలుగు, హిందీ, ఉర్దూ, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఫోక్ కల్చర్ అండ్ స్టడీస్, మేనేజ్మెంట్ స్టడీస్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో (Notification) చూడొచ్చు.
    UPSC Civils Exam: సివిల్స్ రాయాలనుకుంటున్న శుభవార్త.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

    వేతనాలు వివరాలు (Salary Details)..
    -ప్రొఫెసర్ గా ఎంపికైన వారికి నెలకు రూ.1,44,200-రూ.2,18,200 వరకు వేతనం ఉంటుంది
    -అసోసియేట్ ప్రొఫెసర్ గా ఎంపికైన వారికి నెలకు రూ.1,32,400-రూ.2,17,100 చొప్పున వేతనం చెల్లించనున్నారు.
    -అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఎంపికైన వారికి నెలకు రూ.57,700-రూ.1,82,400 వరకు వేతనం చెల్లించనున్నారు.
    UPSC Civils Exam: సివిల్స్ రాయాలనుకుంటున్న శుభవార్త.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

    అర్హతలు (Qualifications):
    వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు నిర్వహించారు. సంబంధిత సబ్జెక్టులలో మాస్టర్ డిగ్రీ, పీహెచ్డీ (PhD) చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో తెలిపారు. టీచింగ్/రీసెర్చ్ లో అనుభవం తప్పనిసరి.
    UGC-NET 2021: విడుదలైన యూజీసీ నెట్ పరీక్షల తేదీలు.. వివరాలివే..

    హార్డ్ కాపీ దరఖాస్తులను పంపే చిరునామా: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, గచ్చిబౌలీ, హైదరాబాద్ - 500046
    Published by:Nikhil Kumar S
    First published: