మానసిక ఆరోగ్యంపై (Mental Health) పరిశోధనలు, అధ్యయనాలు నిర్వహించే గ్లోబల్ మెంటల్ హెల్త్ సంస్థలో మెంటర్, కోచ్, మేనేజర్, అడ్వైజర్‌గా కెరీర్ (Career And Courses) కొనసాగించాలనుకునే వారికి యూకే బేస్డ్ యూనివర్సిటీ (University) ఒకటి గుడ్ న్యూస్ చెప్పింది. గ్లోబల్ మెంటల్ హెల్త్ అండ్ వెల్‌బీయింగ్‌పై పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేషన్ కోర్సును తాజాగా ఆఫర్ చేస్తోంది ఎసెక్స్ యూనివర్సిటీ ఆన్లైన్ విభాగం. ఈ మేరకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 20గా నిర్ణయించారు.
కోర్సు వివరాలు
ఇది ఎనిమిది నెలలు వ్యవధితో కూడిన ఆన్లైన్- పార్ట్‌టైమ్ కోర్సు . గ్లోబల్ మెంటల్ హెల్త్ పాలసీ అండ్ ప్రాక్టీసెస్‌కు సంబంధించిన క్రిటికల్ అంశాలపై ప్రత్యేక దృష్టితో ఈ కోర్సును డిజైన్ చేశారు. కోర్సు ద్వారా అభ్యర్థులు మెంటర్, కోచ్, మేనేజర్, మెంటల్ హెల్త్ లీడ్ లేదా వెల్బీయింగ్ అడ్వైజర్‌గా కెరీర్‌ను కొనసాగించడానికి అవసరమైన నైపుణ్యాలు, అనుభవం పొందనున్నారు. తదుపరి ట్రైనింగ్ ద్వారా స్పెషలిస్ట్ నర్సు, స్పెషలిస్ట్ మెంటల్ హెల్త్ ప్రాక్టీషనర్ లేదా హెల్త్ సర్వీస్ మేనేజర్‌గా కూడా సేవలందించడానికి అవకాశం ఉంటుందని వర్సిటీ పేర్కొంది.
అర్హత ప్రమాణాలు
వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంట్రీ కోసం అభ్యర్థులు సంబంధిత ఫీల్డ్‌లో కనీసం మూడు సంవత్సరాల వర్క్ఎక్స్ పీరియన్స్ (వాలెంటరీ లేదా పే) ఉండాలి. ఇందుకు ఇద్దరి రిఫరెన్స్ ఉండాలి. అకడమిక్ ఎంట్రీ కోసం అభ్యర్థులు గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి. అది UK ఆనర్స్ డిగ్రీకి సమానమైనదిగా ఉండాలి. లేదా సంబంధిత వృత్తిపరమైన అర్హత ఉండాలి. కోర్సులో భాగంగా గ్లోబల్ మెంటల్ హెల్త్‌ను ప్రభావితం చేసే సవాళ్లను గుర్తించడం, ప్రాసెస్ చేయడం, అంతర్జాతీయ ఫ్రేమ్‌వర్క్ కోసం నైతిక విధానాలను అన్వయించడం, అర్థం చేసుకోవడం వంటి అనేక రకాల అంశాలపై అభ్యర్థులకు అవగాహన కల్పించనున్నారు.
మల్టీమీడియా కంటెంట్‌తో ఇంటరాక్ట్..
కోర్సు కంటెంట్‌ను కటింగ్-ఎడ్జ్ వర్చువల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ (VLE) ద్వారా డెలివరీ చేయనున్నారు. లెక్చర్ కాస్ట్స్ వంటి స్టడీ మెటీరియల్‌లను విద్యార్థులు 24/7గా యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మల్టీమీడియా కంటెంట్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి సమకాలీన మార్గాన్ని అందిస్తుంది. అప్లికేషన్ ప్రాసెస్‌లో భాగంగా అభ్యర్థులకు షార్ట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. కోర్సుకు సంబంధించిన ఇంటలెక్చువల్, ప్రాక్టికల్ డిమాండ్స్‌ను మేనేజ్ చేసే సామర్థ్యం అభ్యర్థుల్లో ఏమేరకు ఉందో అంచనా వేయడానికి ఈ టెస్ట్‌ను డిజైన్ చేశారు.
ఐఈఎల్‌టీస్ స్కోర్ 6.5 తప్పనిసరి
ఇంగ్లిష్ మొదటి లాంగ్వేజ్ కాని అభ్యర్థుల సామర్థ్యం తప్పనిసరిగా 6.5 IELTS- (International English Language Testing System) (అకడమిక్) స్కోర్‌కు సమానంగా ఉండాలి. IELTS లేదా అందుకు సమానమైన అర్హత లేకపోతే, యూనివర్సిటియే ఉచిత ఆన్లైన్ ఇంగ్లీష్ టెస్ట్‌ను నిర్వహిస్తుంది. ట్యూషన్ ఫీజు కింద అభ్యర్థులు 3,945 పౌండ్స్(బ్రిటన్ కరెన్సీ) చెల్లించాల్సి ఉంటుంది. అకడమిక్ అచివ్మెంట్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి అభ్యర్థులకు స్కాలర్షిప్ను కూడా మంజూరు చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Mental Health, University