విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్న వారికి యూరప్ బేస్డ్ డూండీ యూనివర్సిటీ (University of Dundee) గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంపిక చేసిన కోర్సుల్లో అడ్మిషన్ తీసుకునే దక్షిణాసియా దేశాలకు చెందిన విద్యార్థులు (Students) స్కాట్లాండ్ (Scotland)లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఈ వర్సిటీ వైస్-ఛాన్సలర్ స్కాలర్‌షిప్స్‌ను ప్రకటించింది. ఈ నిధులతో మెరిట్ స్టూడెంట్స్ తమ కోర్సులను సకాలంలో పూర్తి చేయవచ్చు. అభ్యర్థులు నేరుగా స్కాలర్షిప్ (Scholarship) కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రోగ్రామ్ అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థుల స్కాలర్షిప్ అర్హతను మెరిట్ ఆధారంగా అంచనా వేయనున్నారు. స్కాలర్షిప్కు ఎంపికైన వారికి రాతపూర్వకంగా తెలియజేయనున్నారు.
* ఈ దేశాల విద్యార్థులకు మాత్రమే
దక్షిణాసియాలోని ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలకు చెందిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డూండీ యూనివర్సిటీలో చదువుకోవడానికి ప్రతి సంవత్సరం స్కాలర్ షిప్‌ను మంజూరు చేయనున్నారు. విద్యార్థులు ఎంపిక చేసుకున్న కోర్సు ఆధారంగా దాదాపు 20000 పౌండ్ల వరకు (రూ.18లక్షలకు పైగా) స్కాలర్షిప్ పొందనున్నారు.
* వన్ ఇయర్ స్టడీ స్కాలర్షిప్స్ వివరాలు
డూండీ వర్సిటీ అందించే ఇతర స్కాలర్షిప్లు భారతదేశం నుంచి వెళ్లే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో వన్ ఇయర్ స్టడీ కోసం 5,000 పౌండ్ల (రూ.4.5లక్షలు) విలువైన గ్లోబల్ సిటిజన్‌షిప్ స్కాలర్షిప్; 6,000 పౌండ్ల (రూ.5.4లక్షల) గ్లోబల్ ఎక్సలెన్స్ స్కాలర్షిప్ ఉన్నాయి. ఇక అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మాత్రమే మంజూరు చేసే 5,000 పౌండ్ల విలువైన జైంతిదాస్ సాగర్ మెమోరియల్ స్కాలర్షిప్ ఫర్ ఎక్సలెన్స్ ఫెలోషిప్ కూడా అందుబాటులో ఉంది.
* దక్షిణాసియా దేశాలకే
దక్షిణాసియా దేశాలకు చెందిన విద్యార్థులు డూండీ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించడానికి వైస్-ఛాన్సలర్ స్కాలర్షిప్లను ప్రకటించినట్లు చెప్పారు యూనివర్సిటీ అకడమిక్ లీడ్ ఫర్ సౌత్ ఆసియా ప్రొఫెసర్ హరి హుండాల్. ‘కరోనా మహమ్మారి తరువాత యూకేలో చదువుకోవడం సవాల్‌గా మారింది. దీంతో విద్యార్థుల ప్రయోజనం కోసం ఈ స్కాలర్షిప్ను ప్రకటించాం.
ఇది కూడా చదవండి : నిరుద్యోగులకు అలర్ట్.. ఈ వారంలో అప్లై చేసుకోవాల్సిన జాబ్స్ లిస్ట్ మీకోసం..
ఇది దక్షిణాసియా దేశాల పట్ల యూనివర్సిటీ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. యూనివర్సిటీ ప్రారంభమైన 1967 నాటి నుంచి దక్షిణాసియా దేశాల విద్యార్థులను అక్కున చేర్చుకుంది. యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో అత్యున్నత స్థాయికి ఎదిగారు.’ అని ప్రొఫెసర్ హుండల్ పేర్కొన్నారు.
* మెడిసిన్, డెంటిస్ట్రీ మినహా..
సెప్టెంబర్ -2023 ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకునే అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు స్కాలర్ షిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక, మెడిసిన్, డెంటిస్ట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మినహాయించి సెప్టెంబర్ 2023 లేదా జనవరి 2024 ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకునే పోస్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు స్కాలర్షిప్స్ అందుబాటులో ఉన్నాయని యూనివర్సిటీ పేర్కొంది. యూనివర్సిటీ ఆఫ్ డూండీ వైస్ ఛాన్సలర్ దక్షిణాసియా స్కాలర్‌షిప్‌ల గురించి మరింత సమాచారం అధికారిక వెబ్సైట్ @dundee.ac.ukను సందర్శించాలని వర్సిటీ సూచించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, JOBS, Scholarships